ETV Bharat / politics

సాంస్కృతిక రాజధాని రాజమండ్రి - కాంగ్రెస్​ కంచుకోటకు టీడీపీ బీటలు - Rajahmundry LOK SABHA ELECTIONS

Rajahmundry constituency : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంస్కృతి, వారసత్వానికి వారధిగా నిలుస్తుంది రాజమండ్రి. కోస్తా కొబ్బరి తోటలు, పూల పెంపకం, వ్యవసాయం, పర్యాటక పరంగా ప్రత్యేక స్థానాన్ని కలిగిన రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా పేరొందింది. బ్రిటిష్ పాలనలో రాజమండ్రిగా పిలుచుకున్నా 2015 నుంచి తిరిగి పూర్వపు రాజమహేంద్రవరంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో తొమ్మిది రాజకీయ పార్టీలు పోటీ చేయగా మొత్తం 11 మంది అభ్యర్థుల్లో 9 మంది డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం.

సాంస్కృతిక రాజధాని రాజమండ్రి- కాంగ్రెస్​ కంచుకోటకు టీడీపీ బీటలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 12:59 PM IST

Rajahmundry Constituency : రాజమహేంద్రవరం (Rajamahendravaram Lok Sabha constituency) 1952లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్‌ కేటగిరిలో ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 10 సార్లు, టీడీపీ 3, బీజేపీ 2, వైఎస్సార్సీపీ ఒకసారి విజయం సాధించాయి. నియోజకవర్గ చరిత్రలో కాంగ్రెస్‌కు చెందిన పట్టాభి రామారావు అత్యధికంగా 50.74 శాతం ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన 1984 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీహరి రావు చేతిలో పరాజయం పాలయ్యారు. 1957 నుంచి 1980 వరకు ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. 1984లో తొలిసారిగా టీడీపీ ఇక్కడ విజయం సాధించింది. ఈ హవా 1996 వరకు కొనసాగింది. 1998, 99 ఎన్నికల్లో ఈ స్థానంలో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో మళ్లీ హస్తం పార్టీ చేజిక్కించుకుంది. 2014లో టీడీపీ అభ్యర్థి మాగంటి మురళీ మోహన్‌ విజయం సాధించారు. 2019లో టీడీపీ అభ్యర్థి మాగంటి రూపపై వైఎస్సార్సీపీ అభ్యర్థి మార్గాని భరత్‌ 1,21,634 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

రాజమండ్రి లోక్‌సభ పరిధిలో అసెంబ్లీ స్థానాలు

  1. అనపర్తి
  2. రాజానగరం
  3. రాజమహేంద్రవరం పట్టణం
  4. రాజమహేంద్రవరం రూరల్‌
  5. కొవ్వూరు
  6. నిడదవోలు
  7. గోపాలపురం

2024 ఓటర్ల జాబితా ప్రకారం ఓటర్ల వివరాలు

  • మొత్తం ఓటర్లు 16.06 లక్షలు
  • పురుషులు 7.85 లక్షలు
  • మహిళలు 8.20 లక్షలు
  • ట్రాన్స్‌జెండర్లు 105

ఈసారి ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్నది వీళ్లే!

rajahmundry_loksabha
rajahmundry_loksabha

ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఈ స్థానం బీజేపీ దక్కించుకుంది. ఆ పార్టీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేస్తుండగా, వైసీపీ తరఫున గూడూరి శ్రీనివాసులు పోటీలో ఉన్నారు. ఎన్టీఆర్‌ కుమార్తెగా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన పురందేశ్వరి కాంగ్రెస్‌, బీజేపీలో విస్తృత సేవలందించారు. గతంలో బాపట్ల, విశాఖ ఎంపీగా విజయం సాధించిన ఆమె.. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి ఎంపీగా పోటీ చేసిన మార్గాని భరత్‌ ఈసారి సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటంతో నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడు (పల్మనాలజిస్ట్‌) డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ను ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. గతేడాది వైఎస్సార్సీపీ రాజమహేంద్రవరం సిటీ కో-ఆర్డినేటర్‌గా పనిచేసిన ఆయన ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తుండటం గమనార్హం. కాంగ్రెస్‌ నుంచి గిడుగు రుద్రరాజు బరిలో నిలిచారు.

ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు

1952లో నియోజకవర్గం ఏర్పాటు కాగా తొలిసారి నల్ల రెడ్డి నాయుడు (సోషలిస్టు పార్టీ) ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1952 కానేటి. మోహన్‌రావు (సీపీఐ), 1957 దాట్ల సత్యనారాయణ రాజు (కాంగ్రెస్‌), 1962 దాట్ల సత్యనారాయణ రాజు (కాంగ్రెస్‌), 1967 దాట్ల సత్యనారాయణ రాజు (కాంగ్రెస్‌), 1971 ఎస్‌బీపీ. పట్టాభిరామారావు (కాంగ్రెస్‌), 1977 ఎస్‌బీపీ.పట్టాభిరామారావు (కాంగ్రెస్‌), 1980 ఎస్‌బీపీ.పట్టాభిరామారావు (కాంగ్రెస్‌), 1984 చుండ్రు. శ్రీహరి రావు (టీడీపీ) విజయం సాధించారు.

గత ఎన్నికల్లో విజేతలు - సమీప ప్రత్యర్థులు

1989 జమున (కాంగ్రెస్‌) - చుండ్రు శ్రీహరి (టీడీపీ)

1991 కేవీఆర్‌ చౌదరి (టీడీపీ) - జూలూరి జమున (కాంగ్రెస్)

1996 చిత్తూరి రవీంద్ర (కాంగ్రెస్‌) - చుండ్రు శ్రీహరి (టీడీపీ)

1998 గిరజాల వెంకట స్వామినాయుడు (బీజేపీ) - ఎంవీవీఎస్ మూర్తి (టీడీపీ)

1999 ఎస్‌.బి.పి.బి.కె. సత్యనారాయణరావు (బీజేపీ) - చిత్తూరి రవీంద్ర (కాంగ్రెస్)

2004 ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ (కాంగ్రెస్‌) - కంటిపూడి సర్వారాయుడు (బీజేపీ)

2009 ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ (కాంగ్రెస్‌) - మురళీమోహన్​ (టీడీపీ)

2014 మురళీ మోహన్‌ (టీడీపీ) - బొడ్డు వెంకటరమణ చౌదరి ​(వైఎస్సార్సీపీ)

2019 మార్గాని భరత్‌ (వైఎస్సార్సీపీ) - మాగంటి రూప (టీడీపీ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.