ETV Bharat / politics

రాష్ట్రంలో రణరంగాన్ని తలపిస్తోన్న సార్వత్రిక ఎన్నికలు - ప్రచారంలో స్పీడు పెంచిన ప్రధాన పార్టీలు - Political Parties Election Campaign - POLITICAL PARTIES ELECTION CAMPAIGN

Political Parties Election Campaign : రాష్ట్రంలో ప్రధాన పార్టీలు సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పాంచ్‌ న్యాయ్‌ పేరుతో కాంగ్రెస్‌ ప్రచారజోరు పెంచింది. రాష్ట్రంలో మళ్లీ పట్టునిలుపుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచారబరిలో తీవ్రంగా శ్రమిస్తోంది. తమ మేనిఫెస్టోలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

Political Parties Election Campaign
Political Parties Election Campaign
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 23, 2024, 9:40 PM IST

MP Candidates Election Campaign : లోక్‌సభ ఎన్నికలకు పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్‌ ముఖ్యనేతలు కార్యకర్తలతో సమావేశమవుతూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధి గడ్డం వంశీకృష్ణ తరపున మంత్రి శ్రీధర్‌బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్, పదేళ్ల పాలన అవినీతి ఆరాచకాలతోనే సాగిందని మంత్రి ఆరోపించారు.

BRS Election Campaign : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ, కొత్తపల్లి, మొగుళ్లపల్లి, మండలాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోని భద్రాచలంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరావు పాల్గొన్నారు. కచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని బలరాం నాయక్ కేంద్రమంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

" రైతులు పంటలు నష్టపోతే గతంలో పంటల బీమా సౌకర్యం ఉండేది కాదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో బీమాను వర్తింపచేయడానికి కృషిచేస్తుంది. రైతులు నష్టపోతే పంటల బీమా ఇచ్చే బాధ్యత రాష్ట్రప్రభుత్వం తీసుకుంటుంది. గతంలో బ్యాంకులో రుణం తీసుకునేవారికే ఈ బీమా చెల్లించేవారు. నష్టపోయిన ప్రతిరైతుకు పరిహారం చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేదే తప్ప ఇబ్బంది పెట్టేది కాదు అని తెలియజేస్తున్నా. ఎక్కువ సీట్లు గెలిస్తేనే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేందుకు వీలుంటుంది".- తుమ్మల నాగేశ్వర రావు, మంత్రి

లోక్‌సభ ఎన్నికలకు పదునెక్కిన ప్రచారం - ప్రసంగాలతో జోరందుకున్న విపక్ష పార్టీలు - Lok Sabha Elections 2024

BRS Candidate Speedup Election Campaign : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కేకే ఫైవ్‌ గని వద్ద పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ ప్రచారం నిర్వహించారు. తనను గెలిపించి లోక్ సభకు పంపిస్తే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులకు సింగరేణి సమస్యలపై అవగాహన లేదని కొప్పుల పేర్కొన్నారు. మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత నామినేషన్ అనంతరం ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్​ను గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కవిత పేర్కొన్నారు.

సార్వత్రిక ఎన్నికలకు జోరందుకున్న పార్టీల ప్రచారం - వాడవాడలకు వెళ్తున్న అన్ని పార్టీల అభ్యర్థులు - MP Candidates Election Campaign

రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల హీట్ - జోరందుకున్న పార్టీల ప్రచారాలు - Lok Sabha Polls 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.