PM Modi Telangana Tour in May 2024 : కేంద్రంలో మూడోసారి అధికారం కైవసం చేసుకుని హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోన్న కాషాయ పార్టీ తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రధాని మోదీ ఐదుసార్లు రాష్ట్రంలో పర్యటించారు. ఆదిలాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, జగిత్యాల బహిరంగ సభలతో పాటు మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో రోడ్ షోలో పాల్గొన్నారు.
PM Modi Telangana Election Campaign Schedule : రాష్ట్రంలో ఒక దఫా ఎన్నికల ప్రచారాన్ని మోదీ (PM Modi) పూర్తి చేశారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం తెలంగాణ, ఏపీ నాల్గవ షెడ్యూల్లో పోలింగ్ జరగనుండటంతో మిగతా మూడు ఫేజ్‌ల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రచారం నిర్వహిస్తున్నారు. మూడు ఫేజ్‌ల ఎన్నికలు పూర్తికాగనే నాల్గో ఫేజ్ అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం మోదీ పాల్గొననున్నారు. మే నెల 5, 6, 7 తేదీల్లో ఆయన తెలంగాణలో పర్యటిస్తారని సమాచారం. పోలింగ్ తేదీకి వారం రోజుల ముందు ఇక్కడ మూడ్రోజులు మకాం వేస్తున్నారంటే తెలుగు రాష్ట్రాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు.
ఎస్సీ వర్గీకరణ అంశానికి కట్టుబడి ఉన్నాం, త్వరలో కమిటీ వేస్తాం : ప్రధాని మోదీ
Lok Sabha Elections 2024 : ఉత్తరాదిన మెజార్టీ స్థానాల్లో గెలుస్తామని ధీమాగా ఉన్న కమలదళం తెలంగాణతో (Lok Sabha Polls 2024 ) పాటు దక్షిణాదిలో పాగావేస్తే నిర్దేశించుకున్న 400 సీట్ల లక్ష్యం చేరుకోవచ్చని భావిస్తోంది. ప్రధాని మోదీ ఇప్పటికే ఒక విడత రాష్ట్రంలో పర్యటించి బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి బయటకు వచ్చి కార్యకర్తలు ఉత్తేజంగా పనిచేసేందుకు దోహదపడింది.
'దేశంలో అగ్గిరాజేసేందుకు విపక్షం కుట్ర- వారు ఎక్కడా లేకుండా చేయండి' - pm modi election rally today
PM Modi Telangana Election Campaign Schedule త్వరలో మళ్లీ ప్రధాని పర్యటిస్తారని చెబుతుండటంతో శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. రోడ్ షోలకు ఎక్కువగా నిర్వహించే అవకాశముందని సమాచారం. ఇప్పటివరకు సభలు జరిగిన జిల్లాలు కాకుండా మిగతాచోట్ల రెండుసభలతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కలుపుతూ భారీ రోడ్ షో నిర్వహించాలని భావిస్తోంది. హైదరాబాద్‌లో బహిరంగసభల కంటే రోడ్ షోకే జనం స్వచ్ఛందంగా తరలివస్తారని రాష్ట్రనాయకత్వం భావిస్తోంది. అన్ని వర్గాల ప్రజలను కలిసేలా ఇది సాగుతుందని భావిస్తోంది. ప్రధాని ప్రచారం కలిసి వస్తోందా డబుల్ డిజిట్ స్థానాలు కైవసం చేసుకుంటుందా అనేది రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ నెల 16,17,18 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన!
'అభివృద్ధితో విపక్షాల బుజ్జగింపు విషం బలహీనం- వికసిత్ భారత్‌గా దేశాన్ని మార్చడమే నా టార్గెట్'