ETV Bharat / politics

దిల్లీ లిక్కర్ వ్యవహారంలోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడింది - జగిత్యాల సభలో ప్రధాని మోదీ - Lok Sabha Elections 2024

PM Modi On BRS Delhi Liquor Scam : తెలంగాణను దోచుకున్న వారిని వదిలిపెట్టేది లేదని, ఇది మోదీ గ్యారంటీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. తెలంగాణ ఆశలను కాంగ్రెస్‌ నాశనం చేస్తే, బీఆర్​ఎస్​ రాష్ట్ర ప్రజలను దోచుకుందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా, దాని వెనక కుటుంబ పార్టీలే ఉన్నాయన్న ప్రధాని, దిల్లీ మద్యం అంశంలోనూ బీఆర్​ఎస్​ అవినీతికి పాల్పడిందన్నారు. కాంగ్రెస్‌, బీఆర్​ఎస్​లు ఒకరినొకరు కాపాడుకుంటున్నాయని విమర్శించారు.

PM Modi
PM Modi Speech in Jagtial Meeting
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 18, 2024, 12:40 PM IST

Updated : Mar 18, 2024, 1:00 PM IST

దిల్లీ లిక్కర్ వ్యవహారంలోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడింది - జగిత్యాల సభలో ప్రధాని మోదీ

PM Modi On BRS Delhi Liquor Scam : ఆంగ్లేయులు, రజాకార్లతో పోరాడిన నేల తెలంగాణ గడ్డ అని, కాంగ్రెస్‌ తెలంగాణ ఆశలను నాశనం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. పదేళ్ల పాటు పాలించిన బీఆర్​ఎస్​ రాష్ట్ర ప్రజలను దోచుకుందని, ఇప్పుడు హస్తం పార్టీ తెలంగాణను తమ ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించారు. తెలంగాణ డబ్బు ఇప్పుడు దిల్లీ చేరుతోందన్న ఆయన, ఒక దోపిడీదారు, మరో దోపిడీదారుపై పోరాడలేరని ప్రజలకు తెలుసన్నారు. ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితి అవినీతిపై రేవంత్​ సర్కార్​ మౌనం వహిస్తోందన్న ప్రధాని, కాళేశ్వరం దోపిడీని కాంగ్రెస్ ప్రశ్నించడం మానేసిందన్నారు.

PM Modi at Jagtial BJP Meeting Today : జగిత్యాలలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, కాంగ్రెస్​, బీఆర్​ఎస్​లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్​ఎస్​లు ఒకరినొకరు కాపాడుకుంటూ, బీజేపీని విమర్శిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ 2 పార్టీలు తనను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. తెలంగాణను దోచుకున్న వారిని తాము విడిచిపెట్టేది లేదన్న ఆయన, దోపిడీదారులను వదిలిపెట్టమని హెచ్చరించారు. ఇది మోదీ గ్యారంటీ అని స్పష్టం చేశారు. కుటుంబపార్టీలు దేశాన్ని దోచుకునేందుకే రాజకీయాలు చేస్తాయని ఆరోపించిన ఆయన, దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా, దాని వెనక కుటుంబ పార్టీలే ఉన్నాయని తెలిపారు.

2 జీ స్పెక్ట్రమ్‌ కేసులో డీఎంకే పేరు బయటకు వచ్చింది. అది కుటుంబ పార్టీనే. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ పేరు బయటకు వచ్చింది. అదీ కుటుంబ పార్టీనే. ఇప్పుడు ఆ జాబితాలో కుటుంబ పార్టీ బీఆర్​ఎస్​ చేరింది. కుటుంబ పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి కాళేశ్వరంలో అవినీతి చేసింది. దిల్లీ మద్యం అంశంలోనూ బీఆర్​ఎస్​ అవినీతికి పాల్పడింది. తెలంగాణలో బీజేపీని ఎంతగా గెలిపిస్తే, నేను అంతగా బలోపేతం అవుతా. - ప్రధాని మోదీ

Kishan Reddy Speech in Jagtial Meeting : ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో మంచి పరిపాలన జరుగుతోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి పేర్కొన్నారు. శాంతియుతమైన పద్ధతిలో మోదీ పాలన సాగుతోందని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో పని చేస్తుందన్న ఆయన, గడిచిన పదేళ్లలో రాష్ట్రానికి మోదీ రూ.10 లక్షల కోట్లు ఇచ్చారని వివరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.

రెండు పర్యాయాలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్​ఎస్​ సర్కార్​, రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడిందని కిషన్​రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేసిందని దుయ్యబట్టారు. ఆప్‌ ప్రభుత్వంతో చేతులు కలిపి కవిత మద్యం కుంభకోణానికి పాల్పడిందన్నారు. కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రం తలదించుకునేలా చేసిందని ఆక్షేపించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్​పైనా విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన రేవంత్​ ప్రభుత్వం సైతం దోపిడీ మొదలు పెట్టిందన్న కిషన్​రెడ్డి, 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, వాటికి ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదని మండిపడ్డారు.

దక్షిణ భారతదేశంలో మోదీ విస్తృతంగా పర్యటిస్తున్నారని, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ ప్రజలతో మమేకమవుతున్నారని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. మోదీ తెలుగును ప్రోత్సహిస్తూ, స్వయంగా తెలుగు మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే దేశంలో సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యమన్న కిషన్​రెడ్డి, మోదీని హ్యాట్రిక్‌ ప్రధానిగా ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ నుంచి ఎక్కువ లోక్​సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని, ఇందుకోసం పార్టీ కార్యకర్తలంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.

Last Updated : Mar 18, 2024, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.