PM Modi Adilabad Visit Today : ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి(CM Revath), గవర్నర్ తమిళిసై హాజరవుతున్నందున ఆదిలాబాద్ పట్టణంలో పోలీసు యంత్రాంగం పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రముఖల రాక కోసం ఎనిమిది హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది. ఉదయం దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మహారాష్ట్రలోని నాగపూర్‌కు చేరుకోనున్న ప్రధాని, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఉదయం 10:20 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటారు.
PM Modi CM Revanth in Adilabad Tour Today : అంతకుముందే హైదరాబాద్ నుంచి గవర్నర్ తమిళిసై ఉదయం 9:05 నిమిషాలకు, సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం 9:30 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటారు. ముగ్గురు కలిసి ఇందిరా ప్రియదర్శిని మైదానంలో 6 వేల 700 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ, జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అధికారిక కార్యక్రమాల అనంతరం జరిగే బీజేపీ బహిరంగ సభలో మోదీ ఒక్కరే పాల్గొంటారు. పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు. ఈ నేపథ్యంలో అధికారం యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపట్టింది.
'ఆదిలాబాద్‌లో పీఎం మోదీ సభ కోసం జిల్లా నుంచి 2 వేల పోలీసులను మోహరించాం. ఇక్కడ ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 12 వరకు మీటింగ్ ఉంటుంది. దీని కోసం వీఐపీ సెక్యూరిటీ, సభ చోట మొత్తం చూసుకుంటున్నాం. స్టేడియం, హెలిప్యాడ్, టౌన్ బయట ఉంది. దీని వల్ల పబ్లిక్కు ఎలాంటి ఇబ్బందులు రావు.' - ఆలయం గౌస్, ఆదిలాబాద్ ఎస్పీ
PM Modi Telangana Tour : ఆదిలాబాద్ పట్టణానికి ప్రముఖులు వస్తున్నందున పోలీసు యంత్రాంగం 2 వేల మంది సిబ్బందితో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. బహిరంగసభ జరిగే ప్రియదర్శిని మైదానం పరిసరాల కాలనీల పరిధిలో సాధారణ రాకపోకలను యంత్రాంగం దారి మళ్లించింది. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మోదీ పాల్గొనే బహిరంగసభను విజయవంతం చేసేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. మోదీ(PM Modi Adilabad) రాకతో ఆదిలాబాద్‌లో పండగ వాతావరణం నెలకొననుందన్న బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి పాల్గొనే అధికారిక కార్యక్రమంపై ఆదిలాబాద్ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ, బీజేపీ(BJP) ప్రకటించిన తొలి జాబితాలో రాష్ట్రంలోని ముగ్గురు సిట్టింగ్‌ల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన అధిష్ఠానం, ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావు అభ్యర్థిత్వాన్ని ప్రకటించకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
'గతంలో ఏ ప్రధానిమంత్రి చేయనటువంటి కొన్ని లక్షల కోట్ల రూపాయల సహకారాన్ని ఈ రాష్టానికి ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీకి దక్కుతుంది. గత పది సంవత్సరాల్లో 9 లక్షల 50 వేల కోట్ల రూపాయలు, ఈ రాష్ట్ర బడ్జెట్ కన్నా రాష్ట్ర రెవెన్యూ కన్నా ఎక్కువ ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. కేంద్రానికి ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రత్యేక గౌరవం ఉంది.' - మహేశ్వర్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత
గెలుపు దిశగా కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు - 14 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు!
'అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత - కరీంనగర్లో బీఆర్ఎస్ - బీజేపీ మధ్యే పోటీ'