ETV Bharat / politics

వైఎస్సార్సీపీ లెక్కలు తేల్చిన పవన్​- ఏపీ రాజకీయాల్లో పెను తుపాన్ - sensation in AP politics - SENSATION IN AP POLITICS

Pavan Silent revolution : ‘పవన్‌ అంటే ఓ వ్యక్తికాదు తుపాను' అని ఎన్డీఏ పార్టీల భేటీలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అక్షరాలా నిజమే. చిన్న గాలితెమ్మెర వలే మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం పెనుతుపానుగా మారి వైఎస్సార్సీపీ అరాచక ప్రభుత్వాన్ని కూల్చేసింది. రాజకీయ సునామీ అంటే ఏమిటో జగన్‌ సర్కారుకు తెలిసొచ్చేట్లు చేసింది పవన్ కల్యాణ్ ​ నేతృత్వంలోని జనసేన పార్టీ.

pawan_kalyan_sesation_in_ap_politics
pawan_kalyan_sesation_in_ap_politics (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 12, 2024, 3:27 PM IST

Pavan Silent revolution : కొన్నిసార్లు రావడం లేటు అవ్వొచ్చేమో గానీ, రావడం పక్కా అనే పవన్​ కల్యాణ్ డైలాగ్​ రాజకీయాల్లోనూ నిరూపితమైంది. అధ్యక్షా అని పిలవడానికి పవన్​ పదేళ్లు ప్రజా క్షేత్రంలో ఓ యుద్ధమే చేశారు. ఆయన శక్తి, సామర్థ్యం ఏంటో ప్రత్యర్థులకు తెలుసు కాబట్టే పేదలకు నీడలా నిలబడదామనుకున్న చెట్టులాంటి పవన్‌ను పడగొట్టాలనుకున్నారు. వ్యక్తిగత విమర్శలతో అవమానించారు. హృదయం ముక్కలయ్యే మాటలతో దత్తపుత్రుడంటూ హేళన చేశారు. వైఎస్సార్సీపీ మాజీ ముఖ్యమంత్రి నుంచి మాజీ మంత్రుల వరకూ ప్రతిఒక్కరూ మేకుల్లాంటి మాటలతో మానసికంగా కుంగదీసే ప్రయత్నం చేశారు. కానీ, పవన్‌ ఉక్కు సంకల్పం ముందు అవన్నీ ముక్కలైపోయాయి. జనమే ప్రభంజనమై ఆయన్ను గెలిపించడంతో రాష్ట్ర మంత్రిగా ప్రజల రుణం తీర్చుకొనేందుకు పవన్​ సిద్ధమయ్యారు.

సూట్‌ కేసులతో డబ్బులు పట్టుకొని ఇంటిముందు నిలబడే నిర్మాతలు, సకల సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం, విదేశీ ప్రయాణాలు.. అవేమీ ఆయనకు సంతృప్తినివ్వలేదు. ‘తనని ఆరాధించే, అభిమానించే వారి కోసం ఏదైనా చేయాలన్న తపనతో ప్రజాక్షేత్రమే తనకు సరైన వేదిక అని భావించి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయం పులి మీద స్వారీ లాంటిది, వెనుదిరిగి చూడకూడదు, నేరుగా ఆ రణక్షేత్రంలో దిగితే ఏం జరుగుతుందో కూడా తెలుసు. ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకొనే నవ్యాంధ్రప్రదేశ్‌కు అనుభవజ్ఞుడైన పాలకుడు కావాలని పవన్​ గుర్తించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మద్దతు పలికి . ఎన్డీయేతో మైత్రీని కొనసాగించారు.

జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్‌ కల్యాణ్‌ - Janasena Party Legislature Leader

కాలచక్రంలో ఐదేళ్లు గిర్రున తిరిగాయి, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది నిజం. 2014లో టీడీపీకి మద్దతు పలికిన పవన్‌కల్యాణ్‌.. 2019కి వచ్చేసరికి సైద్ధాంతిక విభేదాలతో ఆ పార్టీకి దూరమయ్యారు. తాను ఢీకొనేది రెండు (టీడీపీ, వైఎస్సార్సీపీ) బలమైన శక్తులని తెలుసీ ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోరాటానికి దిగి ఓటమి పాలయ్యారు. ఆ పరిస్థితుల్లో వేరొకరైతే పార్టీని వదిలించుకునేందుకు చూసేవారు. కానీ పార్టీ శ్రేణులు మనోధైర్యం కోల్పోకుండా పవన్‌ మనో నిబ్బరం నింపాడు. పార్టీ నుంచి గెలిచిన ఏకైక అభ్యర్థి దూరమైనా అధైర్యపడకుండా ఓటమిని దిగమింగి ఓర్పుగా ముందుకు కదిలారు.

జనసైనికులు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండేలా పవన్‌ దిశా నిర్దేశం చేశారు. ప్రజాభీష్టం మేరకు భారీ మెజార్టీతో గెలిచిన వైఎస్సార్సీపీ పాలనపై వేచి చూసే ధోరణితో రాజకీయ విజ్ఞత ప్రదర్శించారు. దాదాపు ఏడాది పాటు ప్రభుత్వంపై పెద్దగా విమర్శల జోలికి పోలేదు. కానీ, అధికారం మత్తు తలకెక్కిన వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతో ఆగ్రహించారు. ప్రశ్నించిన జన సైనికులపై ప్రభుత్వం దాడులకు తెగబడడంతో జనసేనాని స్వయంగా రంగంలోకి దిగి వైఎస్సార్సీపీ ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. పార్టీ నడపాలంటే డబ్బులు కావాలన్న ఆలోచనలతో తాను వద్దనుకున్న సినిమాలను మళ్లీ చేశారు. ఆయన చిత్రాలకు ఏపీ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించినా తట్టుకుని నిలబడ్డారు. జనసైనికుల్లో ఉత్సాహాన్ని ఓ ప్రజాపోరాటానికి ఇంధనంగా మార్చడంలో విజయవంతమయ్యారు. ‘సీఎం.. సీఎం’ అని అభిమానులు నినదిస్తుంటే.. ‘ముందు నన్ను గెలిపించండి..’ అంటూ వినమ్రంగా అడగగలిగిన రాజకీయ నాయకుడు పవన్​ కల్యాణ్ మాత్రమే.

డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ - మంత్రి యోగం ఎవరెవరికో? - AP NEW CABINET MINISTERS list

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 76 మంది కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పరిణామాలతో తీవ్రంగా చలించిపోయిన పవన్​ 2022లో ‘రైతు భరోసా యాత్ర’ చేపట్టారు. ఆత్మహత్య చేసుకొన్న అన్నదాతల బిడ్డల బాధ్యతను స్వీకరిస్తానని ప్రకటించడమే గాకుండా సొంత డబ్బుతో ఆ కుటుంబాలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తన సొంత డబ్బు కోట్ల రూపాయలను ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలకు పంచారు. ఒక దశలో తన కుమారుడు అకీరా కోసం దాచుకొన్న డబ్బును కూడా బాధిత రైతు కుటుంబాలకు పంపిణీ చేసినట్లు సన్నిహితులు పేర్కొన్నారు.

కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడని అంటుంటారు. అలాంటి స్నేహ ధర్మం పాటించిన పవన్‌కల్యాణ్‌ టీడీపీ అధినేత చంద్రబాబు కష్టకాలంలో వెంట నిలిచారు. ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేసిన సమయంలో తానున్నానంటూ వచ్చారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు వెళ్లి మరీ టీడీపీకి మద్దతు పలికి తీవ్ర నిరాశలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మనోస్థైర్యాన్ని కలిగించారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకు అప్పటి సీఎం జగన్‌ చేసిన ముప్పేటదాడికి అడ్డు గోడలా నిలిచారు.

ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీచేయడంలో పవన్‌కల్యాణ్‌ది కీలక పాత్ర. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలను కొనసాగించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, కూటమి అవసరాన్ని అనేక వేదికలపై చెబుతూ పార్టీ శ్రేణులను మానసికంగా సన్నద్ధం చేశారు. మూడు పార్టీల మధ్య సయోధ్య కుదిర్చి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడడంలో సూత్రధారి, పాత్రధారి అయ్యారు.

2024 ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో పవన్​ చేసిన త్యాగం అంతా ఇంతా కాదు. తన బలాన్ని, బలగాన్ని సరిగ్గా అంచనా వేసుకొని పోటీకి సిద్ధపడ్డారు. బీజేపీ కోసం కొన్ని సీట్లు వదులుకొని 100 శాతం స్ట్రైక్‌ రేట్‌తో రికార్డులు బద్దలు కొట్టారు. 'ఫలితంగా ‘కొణిదల పవన్‌ కల్యాణ్‌ అనే నేను’' అంటూ నేడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఎదుట సగర్వంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

'గతి తప్పిన రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరం'- పవన్‌ ప్రతిపాదనకు కూటమి ఏకగ్రీవ ఆమోదం - Chandrababu as CM candidate

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.