ETV Bharat / politics

మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన మెదక్‌ ఎంపీ స్థానం- ప్రచారం ముమ్మరం చేసిన నేతలు - LOK SABHA Election 2024

Parties Speed Up Election Campaign In Medak : మెదక్‌ లోక్‌సభ స్థానానికి ఇప్పటికే మూడు పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. నియోజకవర్గంలో అందరికన్నా ముందుగా బీజేపీ అభ్యర్థిని ప్రకటించడంతో ఆయన ప్రచారాన్ని విస్తృతం చేశారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులుసైతం రంగంలోకి దిగి ప్రజలతో మమేకమవుతున్నారు. క్షేత్రస్థాయిలో నాయకులను కలుస్తూ ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా మూడు పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు.

Parties Speed Up Election Campaign In Medak

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 8:40 PM IST

Updated : Mar 31, 2024, 8:53 PM IST

మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన మెదక్‌ ఎంపీ స్థానం- ప్రచారం ముమ్మరం చేసిన నేతలు

Parties Speed Up Election Campaign In Medak : మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో మెుత్తం ఏడు నియోజకవర్గాలున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న10 నియోజకవర్గాల్లో 7 శాసనసభ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుని కంచుకోటగా మార్చుకుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha polls) బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ ఇక్కడ విజయ కేతనం ఎగరవేయగా ఈ సారీ ఇక్కడి స్థానాన్ని చేజార్చుకోకూడదని బీఆర్ఎస్ యోచిస్తుంది.

అందులో భాగంగానే మాజీ ఐఏఎస్, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డికి అధిష్ఠానం సీటు ఖరారు చేసింది. అధికారిగా తనకున్న అనుభవంతో ప్రజా సమస్యలను తీరుస్తానంటూ హామీలిస్తూ వెంకటరామిరెడ్డి ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఎంపీగా ఎన్నికైన 9 నెలల లోపు రూ.100 కోట్లలతో ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తానని పేదవిద్యార్థులకు ఉచిత విద్య అందిస్తానని ఇప్పటికే ప్రకటించారు. పార్లమెంట్‌ నియోజకవర్గ(parliament constituency) అభివృద్ధికి నిత్యం పాటుపడతానని హామిలిస్తున్నారు.

BJP Strategies To Win Medak MP Seat : మెదక్‌ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. ఇక్కడ్నుంచి రఘునందన్‌రావు రెండోసారి బరిలోకి దింపింది. 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడినా తర్వాత జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ(BJP) తరఫున పోటీ చేసిన విజయం సాధించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ నియోజకవర్గంపై పట్టు, గత పాలనా అనుభవం రఘునందన్‌కు కలిసి వస్తుందనే పార్టీ యోచించి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ప్రచారంలో తనదైన వాక్చాతుర్యంతో దూసుకుపోతున్న రఘునందన్‌ రామమందిరం, ఫిర్‌ ఏక్‌బార్‌ మోదీ సర్కార్‌ నినాదంతో ప్రజల్లోకెళ్తున్నారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

సార్వత్రిక సమరం 2024 - నేతల ఘాటు విమర్శలతో వేడెక్కిన రాజకీయం - ‍Lok Sabha Election 2024

Congress Strategies To Win Medak MP Seat : పటాన్‌చెరు మండలం చిట్కూల్‌ గ్రామంలో వార్డు సభ్యుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన నీలం మధు ముదిరాజ్‌ను కాంగ్రెస్‌ పార్టీ మెదక్‌ అభ్యర్థిగా బరిలో దింపింది. 2006లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మధు 2023లో బీఆర్ఎస్ నుంచి పటాన్‌చెరు ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపాటు గురై కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లోనూ టికెట్‌ దక్కకపోవడంతో ఆ వెంటనే బీఎస్పీలో టికెట్‌ దక్కించుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా మళ్లీ కాంగ్రెస్‌లో చేరి మెదక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌(Congress) అధికారంలో ఉండటం తన సామాజికవర్గం బలాన్ని చేకూరుస్తుందని మధు నమ్ముతున్నారు. సిట్టింగ్‌ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కలిసివస్తుందని కాంగ్రెస్‌ 400స్థానాల గెలుచుకోవాలనే దృఢ నిశ్చయంతో బీజేపీ ముందుకెళ్తున్నాయి. మరీ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పదవిని కట్టబెడతారో వేచిచూడాల్సిందే.

బీఆర్ఎస్ పార్టీ టైటానిక్ ఓడలా మునిగిపోబోతుంది : రఘునందన్​ రావు - Raghunandan Rao comments

40 రోజులు నా కోసం పని చేయండి - గెలిస్తే 5 ఏళ్లు మీ వెంటే ఉంటా : వెంకట్రామి రెడ్డి - BRS Meeting in Medak

Last Updated : Mar 31, 2024, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.