No TDP Ticket to Devineni Family : బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ 31 అసెంబ్లీ, 7 లోక్‌సభ స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. ఈ నేపథ్యంలో పార్టీలో తీవ్ర పోటీ నెలకొనగా, అభ్యర్థుల ఎంపికలో పలు సమీకరణాలు, సర్వేలు కీలకంగా మారాయి. తొలి, రెండు జాబితాల్లో సీనియర్లకు స్థానం దక్కకపోవడంతో మూడో జాబితాపై ఆశ పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన జాబితాలోనూ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుకు అవకాశం లభించకపోవడం గమనార్హం.
13 ఎంపీ, 11 అసెంబ్లీ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల - TDP Candidates Third List
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో చక్రం తిప్పుతూ, ప్రతీ ఎన్నికలో పోటీ చేస్తూ వచ్చిన దేవినేని కుటుంబం, ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోవటం సర్వత్రా చర్చనీయాంశమైంది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం మొదలుకుని, గత 2019 సార్వత్రిక ఎన్నికల వరకూ దేవినేని కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తూ వచ్చారు. ఎన్టీఆర్ పార్టీ ప్రకటించినప్పుడు తెలుగుదేశంలో చేరిన దేవినేని నెహ్రూ 83, 85, 89, 94 ఎన్నికల్లో కంకిపాడు నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు.
ఆంధ్రప్రదేశ్‌లో ధర్మానిదే విజయం - పొత్తుదే గెలుపు - కూటమిదే పీఠం : పవన్ కల్యాణ్
1994 ఎన్నికల్లో దేవినేని నెహ్రూకు వరుసకు సోదరుడైన దేవినేని వెంకటరమణ నందిగామ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1999లో మంత్రిగా ఉన్న దేవినేని వెంకటరమణ రైలు ప్రమాదంలో మృతి చెందగా, ఆయన రాజకీయ వారసుడిగా దేవినేని ఉమా మహేశ్వర రావు ఆ సార్వత్రిక ఎన్నికల్లో నందిగామ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లోనూ వరుస విజయాన్ని నమోదు చేశారు. తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నందిగామ ఎస్సీ రిజర్వ్ కావటంతో 2009, 2014 ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి ఉమా పోటీ చేసి గెలుపొందారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమా మైలవరం నుంచి తిరిగి పోటీ చేయగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గెలుపొందారు. దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఏపీలోని పిఠాపురం నుంచి బరిలో దిగనున్న జనసేనాని పవన్ కల్యాణ్
ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్న 14 అసెంబ్లీ స్థానాలకు గానూ 12 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మరో రెండు స్థానాలు పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు కేటాయించింది. దీంతో ఈ ఎన్నికల్లో దేవినేని కుటుంబం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవ్వరూ పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. రెండో జాబితా వరకూ పెండింగ్‌లో ఉన్న మైలవరం, పెనమలూరు స్థానాల్లో ఒకచోట నుంచి దేవినేని ఉమా పోటీ చేసే అవకాశాన్ని పార్టీ పరిశీలించినప్పటికీ, ఆయా స్థానాలకు మూడో జాబితాలో వసంత కృష్ణప్రసాద్, బోడె ప్రసాద్‌ను ప్రకటించేయటంతో అన్ని దారులూ మూసుకుపోయినట్లైంది.
చరిత్రలో నిలిచేలా ప్రజాగళం సభ - పదేళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపైకి ముగ్గురు అగ్రనేతలు