ETV Bharat / politics

వైసీపీకి మరో షాక్ - పార్టీకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా - ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

MP Vemireddy Prabhakar Reddy Resigned to YSRCP: రాష్ట్రంలో ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న వేళ వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు పార్టీని వీడగా తాజాగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు.

MP_Vemireddy_Prabhakar_Reddy_Resigned_to_YSRCP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 3:24 PM IST

Updated : Feb 22, 2024, 6:35 AM IST

MP Vemireddy Prabhakar Reddy Resigned to YSRCP: రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. అలాగే నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్ష పదవినీ వదులుకున్నారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా సమర్పిస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. వైసీపీకి చేసిన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని సీఎం జగన్‌ (CM Jagan)ను వేమిరెడ్డి కోరారు.

'జగన్‌ను ఓడిస్తేనే సర్పంచులకు మనుగడ'- విజయవాడలో ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ సమావేశం

రాష్ట్రంలో ఎన్నికల సమయం (AP Elections 2024) దగ్గర పడుతుండగా నెల్లూరు రాజకీయాలు (Nellore District Politics) వేడెక్కాయి. ఊహించని మలుపులు తిరుగుతూ జిల్లాలోని రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి గందరగోళంగా మారింది.

ఇప్పటికే ఈ జిల్లాలో పలువురు కీలక నేతలు పార్టీని వీడి టీడీపీలో చేరగా, తాజాగా వేమిరెడ్డి రాజీనామాతో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. సీఎం జగన్​ తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన గతకొంత కాలంగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేసిన ఆయన టీడీపీలో చేరుతారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

మీడియా ప్రతినిధులు, సంస్థలపై పగబట్టిన జగన్ - ఖండించిన నేతలు

వేమిరెడ్డి బాటలోనే నగర డిప్యూటీ మేయర్ రూప్​ కుమార్ యాదవ్ (Nellore Corporation Deputy Mayor Roop Kumar Yadav)​తో పాటు మరికొందరు కార్పొరేటర్లు నడుస్తారని సమాచారం. ఎమ్మెల్యే అనిల్​ కుమార్ (MLA Anil Kumar)​కు బాబాయ్​గా పేరున్న రూప్​ కుమార్ యాదవ్​ పార్టీని వీడితే వైసీపీ కంచుకోటకు బీటలు వారినట్లేనని చెప్పాలి. ప్రస్తుతం ఏపీలో నెల్లూరు జిల్లాలోని తాజా రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్​గా మారాయి.

కాగా ఇప్పటికే వైసీపీకి చెందిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కర్నూలు ఎంపీ సంజీవ్​ కుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీని వీడిన బాలశౌరి ఇటీవలే జనసేన పార్టీలో చేరారు. ఇక శ్రీ కృష్ణ దేవరాయలు ఈ నెల 22న టీడీపీలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

టీడీపీలోకి ఆహ్వానిస్తున్నాం : వైకాపా, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అధికార పార్టీ కుట్రలు భరించలేక వేమిరెడ్డి వైకాపా నుంచి బయటకు వచ్చారని కోటంరెడ్డి చెప్పారు. వేమిరెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఆత్మీయ సమావేశం- వారి సహకారం కోరిన యువనేత

Last Updated : Feb 22, 2024, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.