Chandrababu Message to Youth about C VIGIL App: రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీని ఇంటికి పంపేందుకు రాష్ట్ర పౌరులు బాధ్యత తీసుకుని ముందడుగు వేయాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు (TDP leader Nara Chandrababu Naidu) పిలుపునిచ్చారు. జనం నమ్మకం కోల్పోయిన జగన్ ఎన్నికల్లో అక్రమాలనే నమ్ముకున్నాడని మండిపడ్డారు. వైసీపీ ఎన్నికల కుట్రలను అడ్డుకోవడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సీ-విజిల్ యాప్ (C VIGIL App) ద్వారా ఫిర్యాదులతో వైసీపీ అక్రమాలకు చెక్ పెట్టాలని సూచించారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఓట్ల నమోదుకు ఉన్న అవకాశాన్ని యువత వినియోగించుకోవాలన్నారు. 5 ఏళ్ల పాలనపై సీఎం జగన్‌కే నమ్మకం లేదని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో రాజకీయ హింస, శాంతి భద్రతలపై ఈసీ దృష్టి సారించాలి: చంద్రబాబు
ఎన్నికల నిబంధనలు సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. డబ్బు పంపిణీ, ఓటర్లను ప్రలోభ పెట్టడం, ప్రభుత్వ ఉద్యోగులతో నిబంధనలకు విరుద్దంగా పనులు చేయించడం, ప్రత్యర్థి పార్టీలపై తప్పుడు ప్రచారం చేయడం వంటి వివిధ కోడ్ ఉల్లంఘనలపై సీ-విజిల్ అనే యాప్ ద్వారా ప్రజలే నేరుగా ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు (Complaint to Election Commission) చేయాలని సూచించారు. ప్రజలు తమ దృష్టికి వచ్చిన ప్రతి తప్పును సీ-విజిల్ యాప్ ద్వారా అత్యంత సులభంగా ఈసీ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని చెప్పారు.
ముస్లింలకు మేలు చేసేది టీడీపీనే - వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: చంద్రబాబు
జగన్ రెడ్డి రివర్స్ పాలనతో రాష్ట్రంలో ఎక్కువ నష్టపోయింది యువతే అని దుయ్యబట్టారు. ఓట్ల నమోదుకు ఏప్రిల్ 15 వరకు అవకాశం ఉందని కావున యువత తక్షణమే ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకవాలని సూచించారు. యువత తమ భవిష్యత్ కోసం సమర్థవంతమైన నాయత్వాన్ని గెలుపించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను జగన్ మోసం చేశాడని మండి పడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో సరైన నోటిఫికేషన్ ఒక్కటి కూడా తియ్యలేదని విమర్శించారు.
కోడ్ అమల్లోకి వచ్చినా మారని అధికారుల తీరు- చంద్రబాబు ఇంటివద్ద బెంచీలు ధ్వంసం
కుప్పంలో జోరుగా సాగుతున్న టీడీపీ ప్రచారం: చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం నాయకులు ఎన్నికల ప్రచారాన్ని (TDP leaders Election campaign in Kuppam) జోరుగా సాగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ (TDP MLC Kancharla Srikanth) ఆధ్వరంలో క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజలను కలుసుకుంటున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో కుప్పం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. తెలుగుదేశం మేనిఫెస్టో (TDP Manifesto) కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశంకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.