ETV Bharat / politics

రేపు తిరువూరులో 'నిజం గెలవాలి' ముగింపు సభ - ముమ్మర ఏర్పాట్లు - Bhuvaneshwari Nijam Gelavali Yatra

Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో మనస్థాపం చెంది మృతి చెందిన బాధితులను పరామర్శించటానికి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ యాత్ర ఈ నెల 13తో ముగియనుంది.

Nara_Bhuvaneshwari_Nijam_Gelavali_Yatra
Nara_Bhuvaneshwari_Nijam_Gelavali_Yatra
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 4:37 PM IST

Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్ట్‌తో పలువురు ఆ పార్టీ అభిమానులు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంతో బాధితులను పరామర్శించటానికి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర నిర్వహించారు. ఈ పర్యటనలు ఏప్రిల్ 13వ తేదీతో ముగుస్తున్నాయి. ముగింపు సభకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పుటికే తిరువూరులో చురుకుగా సాగుతున్నాయి.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నేడు, రేపు తిరువూరు నియోజకవర్గంలో "నిజం గెలవాలి " కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్​ను తట్టుకోలేక మనస్తపంతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. నేటి సాయంత్రం విసన్నపేట మండలం కొండపర్వ గ్రామం, ఏ. కొండూరు మండలం కుమ్మరికుంట్ల, పోలిశెట్టిపడు గ్రామం, తిరువూరు మండలం కాకర్ల గ్రామంలో బాధిత కుటుంభ సభ్యుల పరామర్శించనున్నారు.

మీ బిడ్డల భవిష్యత్​ ఆలోచించి ఓటు వేయండి: నిజం గెలవాలి యాత్రలో భువనేశ్వరి - Nijam Gelavali Yatra

భువనేశ్వరి నేటి రాత్రి తిరువూరు శ్రీరస్తూ ఫంక్షన్ హాల్​లో బస చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తిరువూరు పట్టణం 13 వార్డ్​లో పరామర్శించనున్నారు. అనంతరం తిరువూరు పట్టణం దార పూర్ణయ్య టౌన్ షిప్ ఖాళీ స్థలం నందు నిజం గెలవాలి భారీ బహిరంగ సభలో పాల్గొని రానున్న ఎన్నికలలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రసంగించనున్నారు. తిరువూరులో నిజం గెలవాలి ముగింపు భారీ బహిరంగ సభకు టీడీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

చంద్రబాబు అక్రమ అరెస్టుతో 206 మంది మృతి : జైలులో 52 రోజులు గడిపిన తరువాత ఆయనకు బెయిలు మంజూరు అయింది. అయితే చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకో లేక 206 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయా కుటుంబాలకు తాము అండగా ఉంటామని నారా భువనేశ్వరి అప్పట్లోనే ప్రకటించారు. అందులో భాగంగానే నిజం గెలవాలి పేరుతో ఆమె ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో ఆయా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పి భువనేశ్వరి ఆర్థిక సాయం అందజేశారు.

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం - నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర - Bhuvaneswari Nijam Gelavali Yatra

నిజం గెలవాలి కార్యక్రమానికి అశేష ప్రజాదరణ : అయితే భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమానికి అశేష ప్రజాదరణ లభించింది. మండుటెండను కూడా లెక్క చేయకుండా భువనేశ్వరిని కలిసేందుకు భారీగా టీడీపీ కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో నిజం గెలవాలి యాత్ర ప్రారంభం కాగా ఆరు నెలలుగా కొనసాగింది. విడతలవారీగా నిజం గెలవాలి పేరుతో బాధిత కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు.

వైసీపీ రాక్షస పాలనలో చంపడం, హింసించడం అలవాటుగా మారింది: భువనేశ్వరి - Bhuvaneswari Nijam Gelavali Yatra

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.