MP Laxman Fires on Congress : మోదీ ప్రభుత్వం హిందుత్వం కోసం పని చేస్తుందని అసదుద్దీన్ ఓవైసీ విమర్శిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. భవ్యమైన రామ మందిరం నిర్మాణంపై పార్లమెంట్లో చర్చిస్తే, బీఆర్ఎస్ నాయకులు తప్పుబడుతున్నారని ఆరోపించారు. హిందువులను, హిందూ దేవుళ్లను విమర్శించడమే కాంగ్రెస్ లౌకిక వాదమని ధ్వజమెత్తారు. హస్తం పార్టీ, గులాబీ పార్టీలకు తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పాలన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
MP Laxman Comments on BRS : అభ్యర్థుల ఎంపిక, బస్సు యాత్రలపై ఎన్నికల కమిటీ సమావేశాల్లో చర్చించామని లక్ష్మణ్ (MP Laxman) తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఎండగట్టడమే లక్ష్యంగా యాత్రలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అర్థవంతంగా జరిగాయని అన్నారు. పదేళ్లలో మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, సాహసోపెతమైన నిర్ణయాలపై సమావేశాల్లో చర్చించామని పేర్కొన్నారు. దీనిపై శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశామని లక్ష్మణ్ వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికల్లో రెండంకెల స్థానాలు ఖాయం : బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల వివక్ష చూపిందని లక్ష్మణ్ ఆరోపించారు. నెహ్రూ కుటుంబం కోసం మాత్రమే ఆ పార్టీ పని చేసిన వైనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పార్లమెంట్లో ఆవిష్కరింపజేశారని చెప్పారు. ప్రధాని మోదీ కులాన్ని పదే పదే ప్రశ్నిస్తూ హస్తం పార్టీ బీసీలను అవమానిస్తోందని మండిపడ్డారు. వారి హయాంలో జీవించి ఉన్న కాంగ్రెస్ వాళ్లకు భారతరత్న ఇచ్చారని ఆక్షేపించారు. కానీ అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చేందుకు కాంగ్రెస్‌కు మనసు రాలేదని దుయ్యబట్టారు. ఐదుగురికి భారతరత్న ఇస్తే వారు ఓర్వలేకపోతున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు
గవర్నర్ ప్రసంగం చూస్తే ఆరు గ్యారెంటీల అమలుపై అనుమానాలు వస్తున్నాయి : ఎంపీ లక్ష్మణ్
అయోధ్య పర్యాటక, ఆధ్యాత్మిక రంగంగా ఖ్యాతి గడిస్తుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. రాముడు, రామసేతు మిథ్య అని కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. హిందువులను, హిందూ దేవుళ్లను విమర్శించడమే ఆ పార్టీ లౌకికవాదమని విమర్శించారు. ఇందుకు హస్తం పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
"ప్రధాని నరేంద్ర మోదీ కులాన్ని పదే పదే ప్రశ్నిస్తూ కాంగ్రెస్ బీసీలను అవమానిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం కోసం మాత్రమే పనిచేసిందనే విషయాన్ని మోదీ సభలో ఆవిష్కరించారు. కాంగ్రెస్ హయాంలో జీవించి ఉన్న ఆ పార్టీ వాళ్లకు భారతరత్న ఇచ్చారు. అంబేడ్కర్‌కు భారత రత్న ఇచ్చేందుకు మనసు రాలేదు. హిందువుల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ దెబ్బ తీస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పాలి." - లక్ష్మణ్, బీజేపీ ఎంపీ
తెలంగాణలో 10 పార్లమెంట్ సీట్లు 35% ఓట్లతో ఘన విజయం సాధిస్తాం : లక్ష్మణ్
ప్రజలు బీఆర్ఎస్ను ఓడించాలనే కాంగ్రెస్‌కు ఓటేశారు - అసలైన గెలుపు బీజేపీదే : లక్ష్మణ్