MP Dharmapuri Arvind Comments on Kavitha Arrest : అవినీతిని ప్రోత్సహిస్తే జైలుకు వెళ్లడం ఖాయమని నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కవితను అరెస్టు(MLC Kavitha Arrest) చేయలేదని బీజేపీను బద్నాం చేశారని, ఇప్పుడు ఈడీ, సీబీఐ రెండూ అరెస్టు చేశాయని చెప్పారు. ఇప్పట్లో కవితకు దిల్లీ మద్యం కేసు(Delhi Liquor Case)లో బెయిల్ రాదని తెలిపారు. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ అంటే కష్టమేనని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. నిజామాబాద్లో జరిగిన బీజేపీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విమర్శలు చేశారు.
యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే సంకల్ప పత్రం అజెండానని ఎంపీ అభ్యర్థి అర్వింద్ స్పష్టం చేశారు. ఫసల్ బీమాను మరింత పటిష్ఠంగా చేయడమే తమ విధానమని తెలిపారు. నిజామాబాద్ ప్రాంతంలో పండించే కూరగాయల కోసం క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లలో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని వివరించారు.
సీఏఏ అమలుపై మంత్రి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం సమాధానం చెప్పాలి : ఎంపీ అర్వింద్
"కాంగ్రెస్, బీఆర్ఎస్ లెక్క మేం దొంగ వాగ్దానాలు చేయడం లేదు. ఇంతకు ముందుకు కూడా చెప్పినవన్నీ చేశాము. 2019లో ఉన్న ముఖ్యమైన అంశాలను కూడా ఇందులో చేర్చాం. సంకల్ప పత్రం అని భారతీయ జనతా పార్టీ మీ ముందుకు వస్తోంది. ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందించే బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీదే. ఉచిత రేషన్ పథకం రానున్న ఐదు సంవత్సరాలకు కూడా ఆ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తున్నట్లు నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద బీమా పథకం ఆయుష్మాన్ భారత్ ఎవరైనా సరే 70 సంవత్సరాలకు పైబడ్డ భారతీయులు అందరికీ ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుంది." - ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ అభ్యర్థి
సీఎం రేవంత్ రెడ్డి సమర్థుడు - కానీ కాంగ్రెస్లో ఉంటే అసమర్థుడిగా మారిపోతాడు : ఎంపీ అర్వింద్
దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తోంది - తెలంగాణలోనూ వార్ వన్ సైడే : ధర్మపురి అర్వింద్