MP Candidates Election Campaign : లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలవ్వడంతో పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచాయి. వాడవాడకు అన్ని పార్టీల అభ్యర్థులు పర్యటిస్తున్నారు. తమకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ఒక పార్టీపై మరో పార్టీ పరస్పరం విమర్శలకు దిగుతున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తే నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌కు డిపాజిట్ కూడా రాదని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి అన్నారు. ఖరీఫ్ పంట నాటికి రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని జీవన్‌రెడ్డి హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకే-11వ బొగ్గు గనిపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో "బాయి బాట" కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణను లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాలని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
Booth Leaders Meeting In Hyderabad : హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో నిర్వహించిన సనత్‌నగర్ నియోజకవర్గ బూత్ స్థాయి నాయకుల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మహబూబాబాద్ లోక్‌సభ అభ్యర్థి బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ ఇల్లందులో మహిళ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హీట్ - ప్రచారాల్లో జోరు పెంచిన ప్రధాన పార్టీలు - LOK SABHA ELECTIONS 2024
" మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. కలలు కనండి తప్పులేదు కానీ సాకారం అయ్యేలా ఉండాలి. మీ పార్టీకి(బీఆర్ఎస్) ఇప్పటికే అభ్యర్థులు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటివారే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం" - తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి
Jagadeesh Reddy Fires On Komti Reddy Brothers : కోమటిరెడ్డి సోదరుల మధ్య ఆధిపత్య పోరుతోనే కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సీఎం ఆశీస్సుల కోసమే వారు ఆరాటపడుతున్నారని నల్గొండలో ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకు అనుకూల ఫలితాలు వస్తాయని రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం అభ్యర్థి తాండ్ర వినోద్ రావు క్యాంప్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భువనగిరిలో సీపీఎం తరఫున జహంగీర్‌ని బరిలోకి దింపనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. బీజేపీని ఓడించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల హీట్ - జోరందుకున్న పార్టీల ప్రచారాలు - Lok Sabha Polls 2024