ETV Bharat / politics

జోరుగా ఎన్నికల ప్రచారం- జగన్ వైఫల్యాలను ఎండగడుతున్న కూటమి అభ్యర్థులు - Election Campaign in Andhra Pradesh - ELECTION CAMPAIGN IN ANDHRA PRADESH

MLA AND MP Candidates Election Campaign: రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించాయి. తమ పార్టీని గెలిపించాలని ఓటర్లకు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. కూటమి అభ్యర్థులు నియోజకవర్గాల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదే క్రమంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు కొనసాగాయి.

MLA AND MP Candidates Election Campaign
MLA AND MP Candidates Election Campaign
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 9:56 AM IST

MLA AND MP Candidates Election Campaign : అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో ఉరవకొండ కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ రోడ్ షో నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కూటమి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డికి మద్దతుగా నియోజకవర్గంలోని కొత్తచెరువు, తెలమర్లలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రచారం చేశారు. తమ గ్రామంలో తెలుగుదేశం ఎన్నికల ప్రచారం నిర్వహించొద్దంటూ తెలమర్లలో కొందరు వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఇరువైపులా తోపులాట జరగడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. హిందూపురం కూటమి అభ్యర్థి బాలకృష్ణకు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ ప్రచారం చేశారు. పట్టణంలోని మైనారిటీ వార్డుల్లో పర్యటించి బాలకృష్ణను గెలిపించాలని ఓటర్లను కోరారు.

Election Campaign in Andhra Pradesh : కర్నూలు జిల్లా ఆదోని కూటమి అభ్యర్థి పార్థసారథి మండలంలోని కొన్ని గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. తెలుగుదేశం సూపర్‌ సిక్స్‌ పథకాలు వివరించి ఓట్లు అభ్యర్థించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని సోమప్పనగర్‌లో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. తర్వాత చేనేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కర్నూలు కూటమి అభ్యర్థి టీజీ భరత్ నగరంలోని 23వ వార్డులో ప్రచారం నిర్వహించారు. స్థానికులు భరత్‌కు సమస్యలు ఏకరవు పెట్టగా అన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా డోన్ మండలంలోని కొన్ని గ్రామాల్లో కూటమి అభ్యర్థి జయసూర్యప్రకాష్‌రెడ్డి సతీమణి కోట్ల సుజాతమ్మ ఇంటింటి ప్రచారం చేశారు. కామగానిగుంట్ల గ్రామంలోని ఓ ఇంటి వద్ద రొట్టెలు చేస్తున్న మహిళ వద్దకు వెళ్లి కింద కూర్చుని తానూ ఓ రొట్టె చేసి కాల్చారు.

'ఎన్నికల్లో జగన్‌ సర్కారును తరిమికొట్టాలి'- గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల ప్రచారం - Alliance Leaders Election campaign

కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారన్న దాంట్లో వాస్తవం లేదని గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని మోటార్‌ ఫీల్డ్‌ అసోసియేషన్‌ సభ్యులతో ఆటోనగర్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అమరావతిని అభివిృద్ధిని చేసే వారినే ఎన్నికల్లో గెలిపించాలంటూ రాజధాని రైతులు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి నారా లోకేశ్​ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పేదరికంలేని సమాజం, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే చంద్రబాబు ధ్యేయమని బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు. మార్టూరులోని నేతాజీ నగర్, రాంనగర్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ 12వ డివిజన్‌లో ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ తెలుగుదేశం సూపర్‌సిక్స్‌ పథకాలు వివరించారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం మంజులూరులో పెడన కూటమి అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి బాలసౌరి కుమారుడు అనుదీప్ గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. పెనమలూరు కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రచారం చేశారు. అవనిగడ్డ కూటమి అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్‌ను గెలిపించాలంటూ ఆయన కుమార్తె, కోడలు ప్రచారం నిర్వహించారు. రాష్ట్రబీసీ సంక్షేమ సంఘం తరఫున మండలి బుద్ధప్రసాద్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు తెలిపారు.

ఏలూరు జిల్లా దెందులూరు కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పెదవేగి మండలంలో ప్రచారం నిర్వహించారు. సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి మండలంలోని గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. మైనారిటీల పథకాలు ఎత్తేసి వైసీపీ ప్రభుత్వం ద్రోహం చేసిందని తెలుగుదేశం పొలిట్‌ బ్యూరో సభ్యుడు షరీఫ్‌ అన్నారు. ఏలూరు కూటమి అభ్యర్థి బడేటి రాథాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏలూరు వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని పట్టణంలోని వార్డుల్లో ప్రచారం చేశారు.

జోరుగా ఎన్నికల ప్రచారం- జగన్ వైఫల్యాలను ఎండగడుతున్న కూటమి అభ్యర్థులు

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బాలకృష్ణ - వైసీపీ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపు - Balakrishna election campaign

పశ్చిమగోదావరి జిల్లా తణుకు కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ తరఫున ఆయన సతీమణి కృష్ణ తులసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలతో కలిసి అత్తిలిలో ప్రచారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ కుమార్తె రంగప్రియ ప్రచారం చేశారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తన తండ్రిని గెలిపించాలని కోరుతూ ఉండ్రాజవరంలో పర్యటించారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు 38వ డివిజన్‌లో ప్రచారం నిర్వహించారు. సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీగా పురంధేశ్వరిని గెలుపించాలని ఆదిరెడ్డి వాసు కోరారు.

విశాఖ తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు గుడ్ మార్నింగ్ విశాఖ పేరిట ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఉదయం ఆరు గంటలకే నియాజవర్గ పరిధిలోని ఓటర్లను కలిసి తన మేనిఫెస్టోను ప్రజలకు వివిరించి ఓట్లు అభ్యర్థించారు. విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థిగా భరత్‌ను గెలపించాలంటూ ఆయన సతీమణి తేజస్విని ప్రచారం నిర్వహించారు. 33వ వార్డులో పర్యటించి తెలుగుదేశం సూపర్‌సిక్స్ పథకాలు ప్రజలకు వివరించారు.

పార్వతీపురం జిల్లా సాలూరు కూటమి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి, పార్లమెంటు అభ్యర్థి కొత్తపల్లి గీత సాలూరులో రోడ్‌షో నిర్వహించారు. కురుపాం నియోజకవర్గ కూటమి అభ్యర్థి జగదీశ్వరి నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ కూటమి అభ్యర్థి కొండ్రు మురళీమోహన్‌ సంతకవిడి మండలంలో పర్యటించారు. పిల్లల భవిష్యత్తు, రాష్ట్రభవిష్యత్తు బాగుండాలంటే సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. బాపట్ల జిల్లా మార్టూరులో కొంత మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కొంతమంది వైసీపీ కార్యకర్తలు బీజేపీలో చేరారు. కూటమి అభ్యర్థి సుజనా చౌదరి వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జలమూరు జడ్పీటీసీ విజయశాంతి ఆధ్వర్యంలో వైకాపా నుంచి తెదేపాలోకి 100 కుటుంబాలు చేరాయి.

సౌభాగ్యమ్మకు న్యాయం జరగాలంటే నిందితులకు ఓటు వెయ్యొద్దు: సునీత - SUNITA CAMPAIGN FOR YS SHARMILA

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.