ETV Bharat / politics

బీజేపీ బీఆర్​ఎస్​ లోపాయికారి ఒప్పందంతో కాంగ్రెస్​పై విమర్శలు చేస్తున్నాయి : తుమ్మల - Tummala on BJP and BRS

Minister Tummala comments on PM Modi : బీఆర్​ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకుని కాంగ్రెస్​పై విమర్శలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఇవాళ ఇల్లెందులో జరిగిన పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రధాని మైండ్​ గేమ్​ ఆడుతున్నారని విమర్శించారు.

Minister Tummala on Soil Test in Telangana
Minister Tummala comments on PM Modi
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 18, 2024, 5:06 PM IST

Minister Tummala comments on PM Modi : రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల్లో 15 స్థానాలు గెలిచి సోనియా, రాహుల్ గాంధీలకు అప్పగిద్దామని మంత్రి తుమ్మల అన్నారు. ప్రధాని మోదీ 400 సీట్లు అంటూ మ్యాజిక్ డ్రామా, మైండ్ గేమ్ ఆడుతున్నారని చెప్పారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ప్రధాని ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా తేకపోగా ఉన్న సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లెందులోని నిర్వహించిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల సన్నాహక భేటీలో ఆయన పాల్గొన్నారు.

మరోవైపు బీఆర్​ఎస్​ నాయకులు, మాజీ సీఎం కేసీఆర్​ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలు కూడా ఉండదని, ఆరు నెలల్లో కూలిపోతుందని కలలు కంటున్నారని మంత్రి తుమ్మల ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ను గెలిపించిన ప్రజలపై మానసిక స్థితితో బీఆర్​ఎస్​ ఎంత కోపంతో ఉందో తెలుస్తోందని అన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు పడిపోతే దానిని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అప్పుల భారంగా చేశారని, కొత్త రుణాలకు కూడా అవకాశం లేకుండా చేశారన్నారు.

లోపాయికారి ఒప్పందం : 'బీజేపీ బీఆర్​ఎస్​ లోపాయికారి ఒప్పందం చేసుకుని నువ్వు కొట్టినట్టు చెయ్యి నేను తిట్టినట్లు చేస్తాను' అనే ధోరణిలో వ్యవహరిస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నెల 19న జరిగే మహబూబాబాద్​లో కాంగ్రెస్​ అభ్యర్థి బలరాం నాయక్​ నామినేషన్​ కార్యక్రమానికి లక్ష మంది పార్టీ శ్రేణులు హాజరుకావాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు.

'బీఆర్​ఎస్​ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు ఏమో కుంగిపోయింది. దానికి ఆ పార్టీ నేత పలు ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయని సమర్థించుకుంటున్నారు. ప్రాజెక్టులో అవినీతి చేశారు. ప్రభుత్వాన్ని అప్పుల భారంగా చేసి నిరుపయోగమైన అప్పులు చేశారు. దీని వల్ల ఇప్పులకు కొత్త అప్పులకు కూడా అవకాశం లేకుండా చేశారు. కాంగ్రెస్​ను గెలిపించారని కర్కశంగా బీజేపీ, బీఆర్​ఎస్​లు వ్యవహరిస్తున్నాయి.'-తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి

బీజేపీ బీఆర్​ఎస్​ లోపాయికారి ఒప్పందంతో కాంగ్రెస్​పై విమర్శలు చేస్తోంది : మంత్రి తుమ్మల

Minister Tummala on Soil Test in Telangana : రాష్ట్రంలో వానా కాలం సమీపిస్తున్న నేపథ్యంలో రైతుల సౌకర్యార్థ్యం భూసార పరీక్షా కేంద్రాలు అందుబాటులోకి తీసుకొస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో 2020-21 సంవత్సరం వరకు వినియోగంలో ఉన్న 25 భూసార పరీక్ష కేంద్రాలు తిరిగి రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మనిషి ఆరోగ్యం తెలుసుకోవడంలో రక్త పరీక్ష ఎలా ఉపయోగపడుతుందో ? నేల పోషక విలువలు, ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ’మట్టి నమూనా పరీక్ష" అలా ఉపయోగపడుతుందని మంత్రి తుమ్మల తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఈ భూసార పరీక్ష కేంద్రాలన్నీ మూతపడే స్థితికి వచ్చాయని, అవి వెంటనే పునరుద్దరింపచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందని మంత్రి సూచించారు.

నేల స్వభావం రైతుకు తెలిసినప్పుడు దానికి తగ్గ పోషకాలు, సేంద్రీయ ఎరువులు, రసాయన ఎరువుల ద్వారా అవసరం మేరకు వాడుకొనే సౌలభ్యం రైతులకు అందుబాటులోకి తేవడం వల్ల సాగు ఖర్చు గణనీయంగా తగ్గించవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 9, ప్రాంతీయ భూసార పరీక్ష కేంద్రం ఒకటి, మొబైల్ భూసార పరీక్షా కేంద్రం ఒకటి, వ్యవసాయ మార్కెట్ యార్టుల్లో 14 భూసార పరీక్షా కేంద్రాలు ఉన్నాయని ప్రస్తావించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నల బతుకులను ఛిన్నాభిన్నం చేసింది : తుమ్మల - Tummala nageswara rao fires On KTR

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.