ETV Bharat / politics

ప్రధాని పదేపదే భారత్​ను పాక్​తో పోల్చి దేశ గౌరవాన్ని తగ్గిస్తున్నారు : మంత్రి సీతక్క - Minister Seethakka Counter to Modi

Minister Seethakka Comments on PM Modi : ప్రధాని మోదీ పదేపదే భారత్​ను పాకిస్థాన్​తో పోల్చి దేశ గౌరవాన్ని తగ్గిస్తున్నారని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. మణుగూరు పర్యటలో భాగంగా మాట్లాడిన ఆమె, భారతీయ జనతా పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రధాని అడుగుతున్నారన్న సీతక్క, ఇవాళ మీరు ఒక ఛాయ్​వాలాగా ఉండి దేశానికి ప్రధాని అయ్యేంత ప్రజాస్వామ్యం ఫరిడవిల్లిందని అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు.

Minister Seethakka Fires on PM Modi
Congress Leader Seethakka Comments on BJP
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 10, 2024, 9:22 PM IST

Minister Seethakka Comments on PM Modi : ప్రధాని మోదీ భారతదేశాన్ని పాకిస్థాన్​తో పోల్చి దేశ గౌరవాన్ని తగ్గిస్తున్నారని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. మణుగూరులో బుధవారం పర్యటించిన సీతక్క, అక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయం వచ్చిందంటే దేశ సైనికుల(Country Soldiers) సమస్యలు, మరణాలు, చాయ్​వాలా, పాకిస్థాన్ వంటి విషయాలే బీజేపీకి గుర్తుకు వస్తాయన్నారు.

పదేళ్లు దేశాన్ని పాలించిన కాషాయం పార్టీ చేసిన అభివృద్ధిని తీసుకొచ్చిన చట్టాలను వివరించకుండా పాక్​తో భారతదేశం పోటీపడుతుందని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇండియా అమెరికా(America Country) వంటి దేశాలతో పోటీ పడే స్థానాల్లో ఉందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. ఓట్ల రాజకీయం కోసం ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించటం పాకిస్థాన్ వంటి చిన్న దేశంతో భారతదేశాన్ని బీజేపీ పోల్చుతుందన్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా దేశాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తే కమలం పార్టీ మతవిద్వేషాల రాజకీయం చేస్తోందన్నారు.

ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, ఎలాంటి హామీ ఇవ్వలేకపోతున్నా : సీతక్క - Minister Seethakka On Murder Case

"ప్రధాని మోదీ మాట్లాడితే చాలు మన దేశాన్ని పాకిస్థాన్​తో పోల్చుతున్నారు. ఈ దేశ గౌరవాన్ని కుల, మత రాజకీయాలకు అధికారం కోసం పాక్​తో పోల్చి ఇండియా ఔన్నత్యాన్ని తగ్గిస్తున్నారు. దాయాది దేశం స్థాయిలో భారత్​ లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికలు రాగానే సైనిక సమస్యలు, చాయ్​వాలా, పాకిస్థాన్​ ఇవే గుర్తొస్తున్నాయి తప్ప పదేళ్ల బీజేపీ పాలనలో మీరు ఏమి అభివృద్ధి చేశారో ఎందుకు చెప్పటం లేదు."-సీతక్క, మంత్రి

Congress Leader Seethakka Fires on BJP : అందరికీ ఇళ్లు, అటవీ హక్కుల చట్టం, ఉపాధి హామీ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే బీజేపీ పేదలు కట్టుకునే బట్టలు, దేవుని పూజించే అగరబత్తులపై, పాల ఉత్పత్తులపై జీఎస్టీ అమలు చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) రూ.400కు వంటగ్యాస్​ను అందిస్తే బీజేపీ రూ.1200 కు పెంచిందన్నారు. రెండు కోట్ల ఉద్యోగాల కల్పన హామీపై కమలం పార్టీ నోరు మెదపడం లేదన్నారు.

కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వ రంగ సంస్థల్ని బీజేపీ మూసివేస్తుందని ఆరోపించారు. దేశ ఐక్యత కోసం ప్రతి ఇంటికి వెళ్తున్న రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించాలన్నారు. 34 ఏళ్లుగా అత్యున్నత పదవి పొందకుండా రాహుల్ గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి త్యాగం చేసిందని గుర్తు చేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్​ను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.

ప్రధాని పదేపదే భారత్​ను పాక్​తో పోల్చి దేశ గౌరవాన్ని తగ్గిస్తున్నారు : మంత్రి సీతక్క

సీఎం రేవంత్‌ రెడ్డి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది - ఆయనను ఎవ్వరూ ఏమీ చేయలేరు : పంచాంగ కర్త - Congress Ugadi Celebrations in TS

13 స్థానాల్లో కాంగ్రెస్​కు విజయం వరించే ఛాన్స్​ - ఆ నాలుగు స్థానాలు మాత్రం కష్టమే! - LOK SABHA ELECTION 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.