ETV Bharat / politics

రాష్ట్రంలో వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా : మంత్రి పొన్నం - Vaddera Atma Gourava Sabha

Minister Ponnam Prabhakar Fires on BRS Party : గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం బీసీ కులాలకు ఆర్భాట ప్రకటనలు తప్ప, ఒరగబెట్టిందేమీ లేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీసీ కులాల భవనాలు, ఫెడరేషన్​లకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు. హైదరాబాద్​ రవీంద్రభారతిలో జరిగిన వడ్డెర ఆత్మగౌరవ సభకు హాజరైన పొన్నం, బీఆర్​ఎస్​పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Minister Ponnam Prabhakar Comments on BRS
Minister Ponnam Prabhakar Fire on BRS Party
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2024, 7:40 PM IST

Updated : Feb 11, 2024, 7:48 PM IST

వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా - ఎస్టీలో చేర్చేందుకు చట్టసవరణలు అవసరం : మంత్రి పొన్నం

Minister Ponnam Prabhakar Fires on BRS Party : గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం బీసీ కులాలకు ఆర్భాట ప్రకటనలు తప్ప, ఒరగబెట్టింది ఏమీ లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీసీ కులాల సంక్షేమ భవనాలు, ఫెడరేషన్​లకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, పైన పటారం, లోన లొటారం అనే చందంగా కేసీఆర్​ ప్రభుత్వం(BRS Govt) వ్యవహరించిందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల వెంకటేశ్​ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డెర ఆత్మగౌరవ సభలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, కర్ణాటక రాష్ట్ర మంత్రి మహాదేవప్ప, జగద్గురువు శ్రీ ఇమ్మడి సిద్ధ రామేశ్వర స్వామీజీలతో కలిసి పొన్నం పాల్గొన్నారు.

వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా : రాష్ట్ర ఖజానాను గత ప్రభుత్వం ఖాళీ చేసి పోయిందని, ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయాన్ని ప్రజలు గ్రహించాలని మంత్రి పొన్నం కోరారు. వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామన్న ఆయన, అయితే నిధులు లేకుండా ఫెడరేషన్(Federation) ఏర్పాటు చేస్తే ఉపయోగం ఉండదన్నారు. వచ్చే ఏడాది వరకు బడ్జెట్ కేటాయించి వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

వైద్యులు కేవలం ధనలక్ష్మి కటాక్షం కోసమే కాకుండా సామాజిక బాధ్యతగా సేవలందించాలి : పొన్నం ప్రభాకర్

మైనింగ్​లలో వడ్డెరలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారన్న మంత్రి, ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో(CM Revanth) చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చారు. ఇతర రాష్ట్రాల్లో ఎస్టీలుగా ఉన్న వడ్డెరలు, తెలంగాణలో బీసీలుగా కొనసాగుతున్నారని, వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలంటే చట్టసవరణలు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆ దిశగా వడ్డెరలు ఐక్యంగా ఉద్యమించాలని పొన్నం సూచించారు.

"వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలంటే అది రాజ్యాంగానికి సంబంధించిన అంశం. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్​ పెంచాలన్నా, తగ్గించాలన్నా చట్టసవరణలు జరగాల్సిన అవసరం ఉంది. దానికి రాజకీయ ఒత్తిడి జరగాలి. ఆ దిశగా వడ్డెర కులస్తులంతా ఐక్యంగా ఉద్యమించాలి."- పొన్నం ప్రభాకర్,రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి

Vaddera Atma Gourava Sabha in Hyderabad : వడ్డెర కులస్తుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన శాసనసభ స్పీకర్, వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తమ రాష్ట్రంలో వడ్డెరలను ఎస్సీ జాబితాలో చేర్చి, పలు కార్పొరేషన్ ఛైర్మన్​లుగా(Corporation Chairman) అవకాశం కల్పించామని కర్ణాటక మంత్రి మహాదేవప్ప అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి పొన్నంను కోరారు.

'హైదరాబాద్ పేరు, గుర్తింపు దెబ్బతినకుండా మరింత అప్రమత్తంగా పని చేయాలి'

మేడారం జాతర గురించి మంత్రులు పొన్నం, సీతక్కల ఆసక్తికర సంభాషణ - వీడియో వైరల్

Last Updated : Feb 11, 2024, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.