Minister Ponnam Prabhakar Fires on BJP : కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడిగే బీజేపీ (Ponnam Comments on BJP)నేతలు, పదేళ్లలో వారు ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారని వేశారా అని ప్రశ్నించారు. రైతు చట్టాలపై దీక్ష చేస్తే పట్టించుకోని కేంద్రంలోని నాయకులు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారని నిలదీశారు. కరీంనగర్‌లోని ఇందిరా భవన్‌లో 10 ఏళ్ల కమలం పార్టీ పాలనలో రాష్ట్రానికి చేసిన అన్యాయం, కేంద్రం వైఫల్యాలపై ఆయన నిరసన దీక్ష చేపట్టారు.
Ponnam Protest Against BJP : ఈ దీక్షలో ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు నిరసన దీక్ష కొనసాగింది. బీజేపీ ప్రభుత్వం అంబానీకి, అదానీకి దోచి పెడుతున్నది నిజం కాదా అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును అవమానించింది నిజం కాదా అని నిలదీశారు. మోదీ సర్కార్ తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా విభజన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. 12% వస్త్రాలపై జీఎస్టీ విధించారని విమర్శించారు. ఐదేళ్లు బండి సంజయ్ ఎంపీగా ఉండి ఏం చేశారని పొన్నం ప్రభాకర్ అడిగారు.
Lok Sabha Elections 2024 : బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేకంగా ఏమిచ్చిందో చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో, కరువుతో నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ ఐదేళ్లు ఎక్కడికిపోయారని నిలదీశారు. మీరు అమలు చేయని హామీలపై చర్చకు సిద్ధమా అని కమలం పార్టీ నాయకులకు సవాల్ విసిరారు. కరీంనగర్ ఎంపీ అంటే ఒకప్పుడు గౌరవం ఉండేదని, బండి సంజయ్ వల్ల ఆ పరువు పోయిందని పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వం అంబానీకి, అదానీకి దోచి పెడుతున్నది నిజం కాదా. తెలంగాణ ఏర్పాటును అవమానించింది నిజం కాదా. నరేంద్ర మోదీ సర్కార్ తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా విభజన హామీలు అమలు చేయలేదు. 12% వస్త్రాలపై జీఎస్టీ విధించారు. ఐదేళ్లు బండి సంజయ్ ఎంపీగా ఉండి ఏం చేశారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేకంగా ఏమిచ్చిందో చెప్పాలి. - పొన్నం ప్రభాకర్, మంత్రి