ETV Bharat / politics

'శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రతిపక్షం తీరు - ఆ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం' - Minister Ponnam on Kaushik issue - MINISTER PONNAM ON KAUSHIK ISSUE

Minister Ponnam Prabhakar Comments on BRS : గాంధీ, కౌశిక్ చేసింది తప్పే! కౌశిక్​రెడ్డి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదని, భౌతిక దాడులు మంచివి కావని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్​లో నివసించే వారిని ఏనాడూ కాంగ్రెస్ విమర్శించలేదని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రతిపక్షం వ్యవహరిస్తోందన్నారు.

Minister Ponnam Prabhakar Comments on BRS
Minister Ponnam Prabhakar Comments on BRS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 1:55 PM IST

Updated : Sep 14, 2024, 2:21 PM IST

Minister Ponnam Prabhakar Fires on KTR : శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాంతిభద్రతల అంశంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. భౌతిక దాడులు మంచి పద్ధతి కాదనని హితవు పలికారు. పార్టీ ఫిరాయింపులను తాము ఎక్కడా ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని గాంధీభవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

'శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రతిపక్షం తీరు - ఆ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం' (ETV Bharat)

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, బీఆర్​ఎస్ గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను చేర్చుకుందని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు బీఆర్​ఎస్ మంత్రి పదువులు ఇవ్వలేదా అంటూ ప్రశ్నించారు. సీఎల్పీగా దళితుడు ఉంటే ఓర్వలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్​ఎస్ చేర్చుకుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని కూలగొడతాం అని బీఆర్​ఎస్, బీజేపీ అంటున్నాయని చెప్పారు. ప్రజాస్వామికంగా పాలనన చేస్తున్నామని, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా మాట్లాడే నేతలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఏం జరిగిందని శాంతిభద్రతలు క్షీణించాయని అంటున్నారని అడిగారు.

ఆంధ్రా ప్రజలను అత్యంత దారుణంగా విమర్శించింది కేసీఆర్ : మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది బీఆర్​ఎస్ సభ్యులు కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్​లో నివసించే వారిని ఏనాడు కాంగ్రెస్ విమర్శించలేదని అన్నారు. అత్యంత దారుణంగా ఆంధ్రా ప్రజలను విమర్శించింది కేసీఆర్ అని చెప్పారు. బీఆర్​ఎస్ పని అయిపోయిందని ఆ పార్టీ నేత గాంధీనే చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రాంతీయత్వాన్ని రాజకీయంగా వాడుకోవాలనని బీఆర్​ఎస్ ప్రయత్నం చేస్తోందని తెలిపారు.

బీఆర్​ఎస్ ప్రభుత్వంలా నియంతృత్వ పోకడలకు తాము పోవడం లేదని చెప్పారు. గాంధీ, కౌశిక్ చేసింది తప్పే. కౌశిక్​రెడ్డి రెచ్చగొట్టడం కరెక్టు కాదని భౌతిక దాడులు మంచివి కావని సూచించారు. బీఆర్​ఎస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డిపై అనవసర విమర్శలు చేసే చిల్లర గాళ్ల సంగతి చూస్తామని హెచ్చరించారు. చిల్లరగాళ్లను పట్టించుకోవద్దని తమ సీఎం చెప్పారని అందుకే సైలెంట్​గా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

"ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే విధంగా ఎవరూ వ్యవహరించకూడదు. కౌశిక్​రెడ్డి, అరికెపూడి గాంధీ విషయంలో విచారణ చేస్తున్నాం. తప్పు ఎవరు చేసిన ఉపేక్షించేది లేదు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రతిపక్షం వ్యవహరిస్తోంది. శాంతిభద్రతల అంశంలో కఠినంగా వ్యవహరిస్తాం." - పొన్నం ప్రభాకర్, మంత్రి

తమ ఎమ్మెల్యేలను గెలిపించలేదని - హైదరాబాద్‌ ప్రజల మీద రేవంత్ పగబట్టారు : కేటీఆర్ - KTR Slams On Congress Govt

పాడి వర్సెస్ గాంధీ : నేనే మీ ఇంటికి వస్తా - నీకు తట్టుకునే దమ్ముందా? : అరికెపూడి గాంధీ - Padi Kaushik Challenge To Arekapudi

Last Updated : Sep 14, 2024, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.