ETV Bharat / politics

'రెవెన్యూశాఖలో అవినీతి జరిగితే సహించేది లేదు - ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఓకే' - Minister Ponguleti On Revenue Dept

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 18, 2024, 10:59 AM IST

Minister Ponguleti On Revenue Dept : స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తుల పరిష్కారం నిబంధనలకు లోబడే ఉంటుందని వెల్లడించారు. ధరణి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Minister Ponguleti On Revenue Dept
Minister Ponguleti On Revenue Dept (ETV Bharat)

Minister Ponguleti Srinivas Reddy On Dharani Problems : ధరణి సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడే విషయంలో తానైనా, తనకుటుంబ సభ్యులైనా చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందని ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీయైనా ప్రభుత్వ ఆస్తులు విషయంలో ఒకే విధమైన చర్యలు ఉంటాయని ఈ దూకుడు మూణ్నాళ్ల ముచ్చట అసలే కాదని ప్రభుత్వం నిరంతరం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.

హైడ్రా పనితీరును మంత్రి శ్రీనివాసరెడ్డి ప్రశంసించారు. ఇదే రీతిలో జిల్లా కేంద్రాల్లో కూడా ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేందుకు కొత్త ఆర్వోఆర్​ చట్టం తీసుకొచ్చామన్నారు. రెండు మండలాల్లో ఫైలట్​ ప్రాజెక్టు చేపట్టామని చెప్పారు. అక్కడున్న ప్రజల నుంచి ఫీడ్​ బ్యాక్​ ఆధారంగా సమర్థమైన చట్టాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదు : స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖలో అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇస్తే దానిని దుర్వినియోగం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని పొంగులేటి తేల్చి చెప్పారు. ఏసీబీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారం నిబంధనలకు లోబడే ఉంటుందని, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే రీతిలో చర్యలు ఉండవని అన్నారు. నిర్దేశించిన మూడు నెలల్లో వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

స్థలాలు ఉన్నవారికి మొదటి ప్రాధాన్యం : స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ విలువల పెంపు పూర్తి శాస్తీయ పద్ధతిలో ఉంటుందని బిల్డర్ల వినతిపై కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో చర్చించిన తరువాత బిల్డర్ల ప్రతిపాదనపై ముందుకు వెళతామని వివరించారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే విషయంలో మొదటి ప్రాధాన్యత స్థలాలు ఉన్న పేదలకు ఉంటుందన్నారు. ఆ తరవాత ఇంటిస్థలం అందచేస్తామని అందులో కూడా ఎవరి గృహాలు వారే నిర్మించుకుంటారని వారికి ఇవ్వాల్సిన నిధులను నిర్దేశించిన సమయంలో మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

ఎల్​ఆర్​ఎస్​కు త్వరలోనే మోక్షం - 3 నెలల్లో దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు - Ponguleti on Lrs Regularization

పెండింగ్‌లో 1.36 లక్షల ధరణి దరఖాస్తులు - ఈనెల 15లోపు పరిష్కారం కష్టమే! - Dharani Applications Process Delay

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.