ETV Bharat / politics

జగన్​ ఇకనైనా రాజకీయాలు మానుకో - మీ పూజలు అబద్ధం: పయ్యావుల కేశవ్​ - Minister Payyavula On YS Jagan - MINISTER PAYYAVULA ON YS JAGAN

Minister Payyavula Keshav On YS Jagan: జగన్‌కు వెంకన్నస్వామిపై విశ్వాసం ఉంటే ఈసారి తిరుమల వెళ్లినప్పుడు ఆలయంలో డిక్లరేషన్‌ ఇవ్వాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ సూచించారు. వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల లడ్డూ కల్తీ జరిగిన మాట నిజమని మరోసారి స్పష్టం చేశారు. ఇకనైనా రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

Minister Payyavula On YS Jagan
Minister Payyavula On YS Jagan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2024, 7:01 PM IST

Minister Payyavula Keshav On YS Jagan: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చారు. తిరుమలకు వెళ్లేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. జగన్ మారలేదు, దురాలోచనలు మారలేదు అనటానికి ఇదే ఉదాహరణ అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. తిరుమల వ్యవహరం జగన్​కు రాజకీయం కానీ ప్రజలకు అది సెంటిమెంట్ అన్నారు. నెయ్యిలో కల్తీ జరిగిందనేది నిజమని, లడ్డూ ప్రసాదంలో వినియోగించింది నిజమని వెల్లడించారు.

అపచారం జరిగిందనేది నిజమన్నారు. ఇవి ఎవరూ కాదనలేని వాస్తవామన్నారు. జగన్ అబద్ధమని, ఆయన చేసే పూజలు అబద్ధమని దుయ్యబట్టారు. గతంలో లడ్డూ నాణ్యతకు, ఇప్పుడున్న లడ్డూ నాణ్యతకు తేడా గురించి భక్తులనే అడగాలని జగన్​ను కోరుతున్నానని అన్నారు. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. మహాద్వారం నుంచి సీఎం వెళ్లే అవకాశమున్నా, చంద్రబాబు మాత్రం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారానే దర్శనం చేసుకుంటున్నారని తెలిపారు.

అన్యమతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే రిజిస్టర్‌లో సంతకం పెట్టాలని అన్నారు. వెెంకటేశ్వర స్వామిపై జగన్​కు విశ్వాసం ఉన్నట్లు డిక్లరేషన్ మీద సంతకం చేసి దర్శనానికి వెళ్లాలని డిమాండ్ చేశారు. జగన్ చేసిన తప్పులకు భక్తులు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజల మనోభావాలతో ఆడుకున్నది చాలని హెచ్చరించారు.

మీరు చేసిన పాపాలు చాలని, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దన్నారు. పాలక కమిటీ వేయడం మాత్రమే సీఎం చేస్తారని, టీటీడీ పరిపాలనతో సీఎంకు సంబంధం లేదని జగన్ చెబుతున్నారని, అయితే జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన రివర్స్ టెండరింగ్​ను టీటీడీలో ఎందుకు అమలు చేశారని ప్రశ్నించారు. టెండర్లో పాల్గొనేందుకు అవసరమైన అర్హతలను సడలించాలని జగన్ ఒత్తిడి తీసుకు రాలేదా అని నిలదీశారు.

వైఎస్సార్సీపీ హయాంలోని ఓ బోర్డు మెంబర్ నెయ్యి వ్యవహారంపై అనుమానాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోందన్నారు. తక్కువ ధరకు స్వచ్ఛమైన నెయ్యి ఎలా వస్తుందని నార్త్ ఇండియన్ మెంబర్ లేవనెత్తితే నాటి ఈవో ధర్మారెడ్డి, భూమన, సభ్యులు బుల్డోజ్‌ చేశారని ఆరోపించారు. వెెెంకన్న సన్నిధిలో దోపిడీ చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. శిక్ష పడిన ఘటనలు చాలా ఉన్నాయన్నారు. జరగని అపచారాన్ని జరిగిందని చెప్పడానికి మాకేం అవసరమన్నారు. జగన్​కు దేవుడి మీద నమ్మకం లేకపోవడం వల్లే ఈ తప్పులు చేశారని మండిపడ్డారు.

ధర్మప్రచారం, ధర్మ పరిరక్షణలో భాగంగా పాలకుడి మార్పుతోనే ప్రతి రంగంలో మార్పు మొదలైందని తెలిపారు. తప్పులు సరిదిద్దే క్రమంలో నిజాలు వెలుగులోకి వచ్చాయన్నారు. జగన్‌ ఇకనైనా రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఘోరమైన తప్పులు చేసి కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో ఎన్ని పాపాలు వెలుగులోకి వస్తాయో అని అనుమానం వ్యక్తం చేశారు. ఆలస్యం అవుతుందేమో కానీ శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.

గతంలో టీటీడీని వ్యాపార కేంద్రంగా మార్చారని, గత పాలనలో లక్షల సంఖ్యలో సిఫార్సు లేఖలు ఇచ్చారని ఆరోపించారు. చేసిన తప్పులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. చేసిన తప్పులకు ప్రతి ఒక్కరూ పరిహారం చెల్లించాల్సిందేనన్నారు. తప్పు చేసిన వారందరినీ ప్రజలు, చట్టం ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. అన్ని మతాలను గౌరవించే ప్రభుత్వం తమదని పయ్యావుల కేశవ్​ తెలిపారు.

తిరుమల నెయ్యి కల్తీ ఘటన - AR డెయిరీపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు - TTD Complaint to Police on Ghee

టీటీడీ ప్రక్షాళన జరగాల్సిన సమయం ఆసన్నమైంది : మంత్రి నాదెండ్ల మనోహర్‌ - Nadendla Manohar on Tirumala Laddu

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.