ETV Bharat / politics

నాడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం - అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్‌ అవార్డు ఇవ్వొచ్చు: మంత్రి నిమ్మల

ప్రజాజీవనంలో ఉండడానికి అర్హత లేదన్న విషయం జగన్​కు అర్థమైంది - అందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారు

minister_nimmala_ramanaidu_counter_to_ys_jagan
minister_nimmala_ramanaidu_counter_to_ys_jagan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Minister Nimmala Ramanaidu Counter to YS Jagan : అబద్ధాల్లో జగన్‌కి ఆస్కార్‌ అవార్డు ఇవ్వొచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు ‘ఎక్స్‌’ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు. పోలవరం ఎత్తుపై తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లిని మోసం చేసిన జగన్‌ ఛీత్కారానికి గురయ్యారని మంత్ర నిమ్మల ఎద్దేవా చేశారు. జగన్​కు ప్రజా జీవనంలో ఉండడానికి అర్హత లేదన్న విషయం అర్థమైందని, అందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని ధ్వజమెత్తారు. పోలవరం ఎత్తుపై అతని మీడియాలో అబద్ధాలు అచ్చు వేసి గడిచిన రెండ్రోజులుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

తాను పూర్తి వివరాలతో జగన్ పోలవరం ప్రాజెక్టుకు చేసిన ద్రోహం గురించి వివరించానన్నారు. అయినా అతని బుద్ధి మారలేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమేనని ఆరోపించారు. ఆనాడు జల యజ్ఞం పేరిట ధనయజ్ఞం చేశారని ధ్వజమెత్తారు. కృష్ణా మిగులు జలాల్లో హక్కు కోరబోమని బ్రిజెష్ కుమార్ ట్రైబ్యునల్‌కు లేఖ రాసి ఇచ్చి ద్రోహం చేశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన ప్రపంచ బ్యాంక్​ ప్రతినిధులు

Nimmala Ramanaidu Fires On Jagan About Polavaram Height Comments : పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో 15 నెలలు ఆలస్యం చేసి డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి కారుకులయ్యారన్నారు. వారి హయాంలో ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యామ్‌ను కూలగొట్టారని ఆ క్రమంలో 38 మంది ప్రాణాలు బలిగొన్నారని మండిపడ్డారు. పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవడం జగన్ పాపం కాదా? అని ప్రశ్నించారు.

పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ.3,800 కోట్లు దారి మళ్లించి నదుల అనుసంధానానికి గండి కొట్టారని విమర్శించారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి రెండు ఫేజ్‌లుగా విభజించింది జగన్ కాదా అని నిలదీశారు. 41.15 మీటర్లకు తగ్గించాలని కేంద్రం అనుమతి కోరింది జగన్ కాదా? అని ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వం పోలవరం ఎత్తు 45.72 మీటర్లకు పెంచి నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేస్తుందని తెలిపారు. ఇప్పటికైనా అబద్దాలు మాని కుటుంబ కలహాల్ని చక్కబెట్టుకోవాలని మంత్రి నిమ్మల హితవు పలికారు.

జగన్‌ పాలన వెలిగొండకు శాపంగా మారింది - ప్రాజెక్టును పూర్తిచేసి సస్యశ్యామలం చేస్తాం: మంత్రి నిమ్మల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.