Minister Komatireddy Said Investigate Construction of Yadagirigutta : యాదగిరిగుట్ట నిర్మాణంపై విచారణ చేయిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆర్ఆర్ఆర్(RRR) అలైన్‌మెంట్‌పై మార్పులు చేర్పులు ఉంటాయని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkatreddy) మాట్లాడుతూ నాలుగు నెలల్లో ప్రభుత్వ ప్రతిష్ఠ దిగజార్చారని ప్రతిపక్షాలు కామెంట్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వంతో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణంలో ఎవరికీ ఇబ్బందులు కలగకుండా రహదారి నిర్మాణం ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిందని ధ్వజమెత్తారు.
ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని అభివృద్ధి కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం మొత్తం సంపదను దోచుకుని తిన్నదని విమర్శలు చేశారు. గత ప్రభుత్వం ఆరు వేల స్కూల్స్ మూసి వేసిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు వేశామని గుర్తు చేశారు.
"ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఇది ప్రజలకు మంచి చేకూర్చేలా ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.25 వేల కోట్లకు ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కడుతుందని అంటే వద్దని చెప్పింది. అప్పుడు ఓఆర్ఆర్ కడితేనే హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ను కడితే పూర్తిగా తెలంగాణ స్వరూపమే మారిపోతుంది. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ప్రజలు గెలిపిస్తారు. రాహుల్ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసింది." - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి
'కృష్ణా జలాలపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు - ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నారు'
అత్యధిక లోక్‌సభ సీట్లు గెలుచుకుంటాం : సిస్టమ్ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. నిరుద్యోగుల కోసం గ్రూప్ 1, డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) ఇచ్చామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అత్యధిక లోక్‌సభ సీట్లు గెలుచుకుంటుందని అన్నారు. అవి 13 నుంచి 14 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రెండు అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాలేదని ధ్వజమెత్తారు.
Minister Komatireddy Fires on BRS : యాదగిరి గుట్ట దేవస్థానం నిర్మాణంపై కూడా విచారణ చేయిస్తామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిందని, ఆ పార్టీ వాళ్లే తమను అభినందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లోక్‌సభ ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ప్రజలు కచ్చితంగా గెలిపిస్తారన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందని గుర్తు చేశారు.
13 నుంచి 14 ఎంపీ సీట్లు గెలవడం ఖాయం - ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు నమ్మొద్దు : మంత్రి కోమటిరెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే సత్తా కిషన్‌రెడ్డికి లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి