ETV Bharat / politics

బీఆర్ఎస్‌ మునిగిపోతున్న పడవ : కోమటిరెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 13, 2024, 5:45 PM IST

Minister Komatireddy Focus on Nalgonda Development : వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. నల్గొండలో పర్యటించిన మంత్రి, పట్టణంలోని పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. నల్గొండను ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్‌ మునిగిపోతున్న నావగా అభివర్ణించిన కోమటిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కుల, మతాలకు నిలయమని పేర్కొన్నారు.

Minister Komatireddy Nalgonda Visit
Minister Komatireddy Focus on Nalgonda Development

Minister Komatireddy Focus on Nalgonda Development : నల్గొండ జిల్లాల్లో ప్రజలకు ఎక్కడ నీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఈసారి సమృద్ధిగా వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు(Ground Water) అడుగంటిపోయాయని, కొంత నీటి సమస్య ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అవసరమైతే ట్యాంకర్ల ద్వారా అయిన నీళ్లు అందించాలని ఆదేశించారు.

నల్గొండ పర్యటనకు వచ్చిన మంత్రి కోమటి రెడ్డి, పట్టణంలోని పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. నల్గొండను ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. రూ.600 కోట్లతో చేపట్టే నల్గొండ ఓఆర్‌ఆర్‌(Outer Ring Road) పనులకు వచ్చే నెల టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. ఆరు వరుసల రోడ్డు పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

సిరిసిల్లలో నువ్వా నేనో తేల్చుకుందాం- కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి ఓపెన్ ఛాలెంజ్‌

Minister Komatireddy Nalgonda Visit : రోడ్లు, డ్రెయిన్ల పనుల నాణ్యతపై రాజీపడవద్దని అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. అదేవిధంగా మహాత్మాగాంధీ వర్సిటీలోని ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి ప్రకటించారు. ఇటీవల జరిగిన జాబ్ మేళాలో 6 వేల మందికి ఉద్యోగాలు కల్పించామన్న ఆయన, మే నెలలో నల్గొండలో మరో జాబ్ మేళా(Job Mela) నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో, జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి, తాగునీటి సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

"కేసీఆర్‌ ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు. ఇప్పటికే రోజు నాలుగు, ఐదుగురు ఎంపీలు పోతుంటే ఇంక పార్టీ ఎక్కడ ఉంటుంది. ముగ్గురు ఎంపీలు అయితే ఏకంగా బీజేపీలోకి వెళ్లి, టికెట్లు పొందారు. మండల, జిల్లా స్థాయిలోని కార్యకర్తలు మా దగ్గరకు వస్తున్నారు. కుల,మతాలకు అతీతంగా ఏకైక సెక్యులర్‌ పార్టీ మాదే. కేంద్రంలో ఇండియా కూటమిలో రాహుల్‌ ప్రధాని కాబోతున్నారు."-కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి

బీఆర్‌ఎస్‌ మునిగిపోతున్న నావ : ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, బీఆర్ఎస్‌ పార్టీను మునిగిపోతున్న నావగా అభివర్ణించారు. రాష్ట్రంలో గులాబీ పార్టీ(BRS Party) ఈసారి ఒక్క సీటు కూడ గెలవదని, అభ్యర్థులకు టికెట్ల ఇస్తున్నప్పటికీ వద్దని వేరే పార్టీలలో చేరుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే పలువురు నాయకులు కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో చేరినట్లు, మిగిలిన వారుకూడా హస్తం, కమలం గూటికి చేరనున్నట్లు తెలిపారు.

Minister Komatireddy Comments on BRS : ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యే సైది రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారన్న ఆయన, మరోవైపు తండ్రి కొడుకులు కూడ బీఆర్ఎస్‌ను వీడి పోనునట్లు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,అమిత్ రెడ్డిలను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అన్ని మతాలకు,కులాలకు నిలయమని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

నల్గొండను ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్రప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే బీజేపీని నామరూపాల్లేకుండా చేస్తా : కోమటిరెడ్డి

'కాంగ్రెస్​ గెలిస్తే మహిళలకు ఏడాదికి రూ.లక్ష- ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.