Minister Kollu Ravindra comments on YS Jagan: విజన్ గురించి ప్రిజనరీకి ఏం తెలుస్తుందని ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దోచుకోవడం, దాచుకోవడంలో జగన్ రెడ్డిని మించినోళ్లు లేరని ఆయన మండిపడ్డారు. విజన్ 2020ని ఎగతాళి చేసినోళ్లే నేడు ఫలితాలు అనుభవిస్తున్నారని అన్నారు. ఉద్యోగాల గురించి మాట్లాడే జగన్ సైబరాబాద్ చూసి తెలుసుకోవాలని మంత్రి హితవు పలికారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేయని దుర్మార్గుడు జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు. తండ్రి పాలనను వాడుకుని లక్ష కోట్లు దిగమింగిన ఘనత జగన్ రెడ్డిదని ఆరోపించారు. తన పాలనలో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదేనని అన్నారు. చంద్రబాబు గురించి, విజన్ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదని హెచ్చరించారు. రాష్ట్రానికి జగన్ చేసిన ద్రోహాన్ని గుర్తించిన ఏ ఒక్కరూ క్షమించరని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
'పోలవరం పూర్తయ్యేది అప్పుడే - టార్గెట్ ప్రకటించిన సీఎం చంద్రబాబు
రాష్ట్రాన్ని వణికిస్తున్న చలిగాలులు - అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత @5.7 డిగ్రీలు