Minister Rajanarsimha on Guarantees : తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, నిశబ్ధయుద్దంతో కుటుంబపాలనకు చరమగీతం పాడారని వైద్యారోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చిందని, గ్యారంటీలను అమలుచేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్ధిగా సురేష్ శెట్కార్, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు హాజరయ్యారు.
చెరకు రైతులకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం కృషి : మంత్రి దామోదర
ఈసందర్భంగా మాట్లాడుతూ మంత్రి మాట్లాడుతూ, బీఆర్ఎస్ నేతలకు జీవితాంతం అబద్దాలు మాట్లాడటం తప్పా ఇంకోటి ఉండదా ? అంటూ దామోదర రాజనర్సింహ ప్రశ్నించారు. ప్రతిపక్షం అన్నప్పుడు సహనం, ఓపిక ఉండాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి నాలుగు నెలలే అవుతోందని, ఇంకా నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అధికారంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఇచ్చిన గ్యారెంటీలు తప్పకుండా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మంత్రి రాజనర్సింహ స్పష్టం చేశారు. రుణమాఫీని సైతం అమలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలనుంచి మంచి స్పందన వస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మరింత ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ శెట్కార్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Shabbir Ali Comments on BRS : బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైందని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. అబద్దాలు చెప్పడం మానుకొని వాస్తవంలోకి రావాలన్నట్లు తెలిపారు. ఆకాశం మీద ఉమ్మితే తన మీదే పడుతుంది అన్న విషయం హరీశ్‌రావు గుర్తు పెట్టుకోవాలని షబ్బీర్ అలీ తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేసిందో చెప్పాలన్నారు. దళిత ముఖ్యమంత్రి ఏమైంది?, మూడెకరాల భూమి ఏది?, రిజర్వేషన్లు ఏమయ్యాయన్నారు. తాము 90 రోజుల్లోనే 5 గ్యారంటీలను నెరవేర్చినట్లు పేర్కొన్నారు.
"బీఆర్ఎస్ నేతలకు జీవితాంతం అబద్దాలు మాట్లాడటం తప్పా ఇంకోటి ఉండదా? కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చింది. గ్యారంటీలను అమలుచేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాము. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. నిశ్శబ్ధయుద్ధంతో కుటుంబపాలనకు చరమగీతం పాడారు. ప్రతిపక్షం అన్నప్పుడు సహనం, ఓపిక ఉండాలి." - దామోదర రాజనర్సింహ, మంత్రి
త్వరలో అన్ని జిల్లాల్లో భరోసా కేంద్రాల ఏర్పాటు : మంత్రి దామోదర
పాశమైలారంలో కాలుష్య వ్యర్థాల శుద్ధి కర్మాగారం ఏర్పాటు - మంత్రులతో కలిసి ప్రారంభించిన స్పీకర్