Minister Anitha Fire on YSRCP Leaders : ఆడ పిల్లల రక్షణలో తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందని హోం మంత్రి అనిత అన్నారు. వడమలపేట మండల ఘటన జరిగిన 48 గంటలలోనే నిందితులను పట్టుకొని తగిన సాక్ష్యాధారాలతో రిమాండ్కు తరలించారని తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి విమానశ్రయానికి చేరుకున్న ఆమెకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం వడమలపేట మండలానికి బయలు దేరి వెళ్లారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని అనిత మండిపడ్డారు.
కఠినంగా శిక్ష పడేలా చర్యలు : హత్యాచార ఘటనల కేసులను విచారించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని అనిత తెలిపారు. జిల్లా వడమాలపేట మండలంలో హత్యాచారానికి గురైన చిన్నారి తల్లిదండ్రులను మంత్రి పరామర్శించారు. 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి చిన్నారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. నిందితుడికి 2 నుంచి 3 నెలల్లో కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు మంత్రి హామీ ఇచ్చారు.
తిరుపతి జిల్లాలో దారుణం - చాక్లెట్ ఇప్పిస్తానని మూడున్నరేళ్ల బాలికపై హత్యాచారం!
మహిళలకు అండగా ఉంటాం : గత ప్రభుత్వంలో అనేక హత్యాచారాలు జరిగాయని, అప్పుడు రాని వారు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయ లబ్ది కోసం పాకులాడడం సరైనది కాదన్నారు. చిన్నారుల మరణాలను రాజకీయంగా వాడుకునే రాబందులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో సీసీ కెమెరాలు నిర్వీర్యం చేసి గంజాయి, నకిలీ మద్యం విచ్చల విడిగా యువతకు అలవాటు అయ్యేలా వ్యవహరించారని మండిపడ్డారు. బాధితుల పక్షాన నిలబడడమే కాదని, ఎలాంటి సంఘటనలు జరగకుండా మహిళలకు అండగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళా సాధికారతకు, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందన్నారు.
చిన్నారిపై హత్యాచారం కలిచివేసిందన్నారు. వడమలపేట మండల ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా ఉందన్నారు. చిన్నారి కుటుంబానికి సొంత ఇంటిని నిర్మించి ఇస్తామన్నారు. ఘటన జరిగిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. ఈ ఘటనను రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. ఎక్కడ ఘటన జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోందని, చిన్నపిల్లల మరణాల్ని వైఎస్సార్సీపీ రాజకీయం చేయడం బాధాకరమన్నారు. చంద్రబాబును విమర్శించే అర్హత జగన్కు లేదన్నారు. గత పాలనలో మద్యం ఏరులై పారిన తీరు రోజాకు తెలియలేదా అని ప్రశ్నించారు. మద్యంపై రోజా చేస్తున్న రాద్ధాంతం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మేన కోడలిపై అత్యాచారం - బిడ్డ పుట్టాక మొదలైన వేధింపులు
మద్యం మత్తులో దివ్యాంగురాలిపై అత్యాచారం- మనస్తాపంతో ఆత్మహత్య!