ETV Bharat / politics

మహబూబ్‌నగర్​లో ఎన్నికల హీట్ - ఎమ్మెల్సీ పదవిపై ప్రధానపార్టీల ఫోకస్ - MLC By Election in Mahabubnagar

Mahabubnagar MLC By Election 2024 : రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హడావుడి నడస్తుంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల మండలి స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఎమ్మెల్సీ పదవికి ప్రధాన రాజకీయ పార్టీల్లోని ఆశావహులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున హస్తం పార్టీలో ఆ అవకాశాన్ని దక్కించుకునేందుకు పోటీ తీవ్రంగా ఉంది.

Political Parties Targeting Mahabubnagar MLC
Mahabubnagar Local Bodies Council Seat By Election
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 3, 2024, 8:19 AM IST

ఎమ్మెల్సీ ఉపఎన్నికపై ప్రధానపార్టీల పోటీ - మహబూబ్‌నగర్ స్థానం ఎవరికి దక్కునో!

Mahabubnagar By MLC Election 2024 : మహబూబ్‌నగర్‌ స్థానికసంస్థల మండలి ఉపఎన్నికకు షెడ్యూల్‌ విడుదల కావడంతో, పాలమూరులో ప్రధానపార్టీలు రంగంలోకి దిగాయి. ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక వచ్చింది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి 2028 జవనరి 4 వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారు. పూర్వ మహబూబ్‌నగర్‌కు 2021 నవంబరులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో 2స్థానాలకు నోటిఫికేషన్‌ పడింది.

అప్పుడూ ఉమ్మడి జిల్లా నుంచి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో బీఆర్ఎస్(BRS Party) అధికారంలో ఉండటం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అదే పార్టీకి చెందిన వారు కావడంతో, ఇతర పార్టీల అభ్యర్థులు పోటీకి ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారింది. కాంగ్రెస్‌ రావడంతో ఉపఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలన్ని ఉపఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించాయి.

ఎమ్మెల్సీ పదవికి ఆశావహుల పోటీ : మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పూర్వ మహబూబ్‌నగర్‌లోని 14నియోజకవర్గాల్లో ఎన్నికైన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పురపాలిక కౌన్సిలర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఓటర్లుగా ఉంటారు. 2021లో 1,445 మంది ఓటర్లు ఉన్నారు. స్థానిక సంస్థల పదవీకాలం ముగియకపోవడం వల్ల, ప్రస్తుతం వారే ఓటర్లుగా ఉండనున్నారు. అప్పట్లో 1,039మంది బీఆర్ఎస్, కాంగ్రెస్‌ నుంచి 241 మంది ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి 119 మంది ఉండగా ఇతరులు 46 మంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు.

తెలంగాణలో 9 మంది బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన - మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్​ పోటీ

అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది పార్టీలు మారారు. రాష్ట్రంలో కాంగ్రెస్(Congress Govt) అధికారంలోకి వచ్చాక, మరికొందరు హస్తంగూటికి చేరారు. ఈ నేపథ్యంలో ప్రధానపార్టీల బలాబలాలు మారిపోయాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉండనుంది. భారతీయ జనతా పార్టీకి ఓటుబ్యాంకు తగినంత లేకపోవడంతో ఆ పార్టీ నుంచి అభ్యర్థిని పోటీలో నిలుపుతారా? లేక ఏదైనా పార్టీకి అంతర్గత మద్దతు ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది.

MLC By Election in Mahabubnagar 2024 : ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బరిలోకి దిగేందుకు హస్తం పార్టీలో పోటీ మొదలైంది. మహబూబ్‌నగర్ నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి, అధిష్ఠానం బుజ్జగింపులతో వెనక్కి తగ్గిన ప్రముఖ న్యాయవాది వెంకటేశ్​, సంజీవ్ ముదిరాజ్, వినోద్‌కుమార్ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మన్నెజీవన్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో అధికంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మైనారిటీ కోటా(Minority Quota) కింద ఓబేదుల్లా కొత్వాల్‌కు మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ పదవి దక్కింది. సామాజిక న్యాయం చేసే దిశగా బీసీలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి అధిష్ఠానం ఎవరికి ఆ అవకాశం కల్పిస్తుందో వేచి చూడాల్సిందే.

అభ్యర్ధిని నిలుపుతామని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎంపీటీసీలు వెల్లడించారు. వారి సమస్యలపై చట్టసభల్లో గళం వినిపించేందుకు 896 ఓట్లున్న తమ నుంచి ఒకరిని అభ్యర్ధిగా నిలుపుతామని ఇటీవలే జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రకటించారు. నామినేషన్ల స్వీకరణ సమయానికి ప్రధాన పార్టీల నుంచి పోటీచేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

నేటి నుంచి బీఆర్​ఎస్​ లోక్‌సభ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ

ఈనెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.