Nara Lokesh on Container Vehicle at CM Camp Office : సీఎం జగన్ ఇంట్లోకి నిబంధనలు అతిక్రమించి వెళ్లిన కంటెయినర్ సంగతేంటని నారా లోకేశ్ ప్రశ్నించారు. పోలీసులు రోజూ తన కాన్వాయ్ తనిఖీ చేస్తున్నారని ఒక్క ఎన్నికల నిబంధన(Election Code Of Conduct) ఉల్లంఘనైనా కనిపించిందా అని ప్రశ్నించారు. పోలీసులు కళ్లెదుటే జగన్ నివాసంలోకి వెళ్లిన కంటెయినర్‌ను(Container) ఎందుకు తనిఖీ చేయలేదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా లోకేశ్ ప్రశ్నించారు.
ఆ కంటెయినర్లో ఏముందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బ్రెజిల్ సరకా, మద్యంలో మెక్కిన వేల కోట్లు కంటెయినర్లో తెచ్చారా అని నిలదీశారు. లండన్ పరారీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారా లేక ఏపీ సెక్రటేరియట్ దాచిన దొంగ ఫైళ్లు కంటెయినర్లో వచ్చాయా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు డీజీపీ సమాధానం చెప్పగలరా అని లోకేశ్ సవాల్ విసిరారు.
తన వాహనాన్ని పదే పదే తనిఖీ చేయడంపై లోకేశ్ అసహనం - అధికారుల తీరుపై అచ్చెన్న ఆగ్రహం
తాయిలాలతో ఓటర్లను ఏమార్చే కుట్ర: ఓటమి భయంతోనే తాయిలాలిచ్చి ఓటర్లను ఏమార్చేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిపోయిన జనం జగన్‌ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్‌లో బంధించాలని నిర్ణయానికొచ్చిన నేపథ్యంలో చీప్ ట్రిక్స్‌తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో(ELECTIONS) ఎలాగో గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే(MLA) చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి చెందిన గోదాములో పంపకానికి సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు, స్పీకర్లు, విసనకర్రలతో పాటు మొత్తం 52 రకాల వస్తువుల డంప్‌ను అధికారులు పట్టుకున్నారన్నారు.
Nara Lokesh Comments On YSRCP : టీడీపీ ఫిర్యాదు చేస్తే వైసీపీ తాయిలాల డంప్ నైతే పట్టుకున్నారు మరి ఇసుక, లిక్కర్లో జగన్ దోచుకున్న డబ్బులను ఎప్పుడు పట్టుకుంటారని లోకేశ్ ప్రశ్నించారు. అలానే ఎన్నికల్లో పంచడానికి జగన్ సిద్ధం చేసిన డబ్బుల డంప్‌ను ఎప్పుడు పట్టుకుంటారని ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి కిలో బంగారం ఇచ్చినా ప్రజల్లో మీపై నెలకొన్న ప్రజాగ్రహజ్వాలలను అడ్డుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని జగన్ గుర్తించాలని లోకేశ్ హితవు పలికారు.
తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టే వరకు యుద్ధం ఆగదు: నారా లోకేశ్
రాష్ట్రాన్ని గంజాయికి రాజధానిగా వైసీపీ ప్రభుత్వం మార్చింది: యువగళం పాదయాత్రలో లోకేశ్