ETV Bharat / politics

మరో 2 రోజుల్లో ముగియనున్న గడువు - రాష్ట్రంలో ఊపందుకున్న సార్వత్రిక ఎన్నికల నామినేషన్లు - Lok Sabha Elections Nominations

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 23, 2024, 9:38 PM IST

Lok Sabha Elections Nominations : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు మరో రెండు రోజుల్లో నామినేషన్ల గడువు ముగియనుండటంతో సందడి మరింత ఊపందుకుంది. బరిలోకి దిగుతున్న వారంతా ఇప్పటికే దాదాపుగా నామపత్రాలు దాఖలు చేయగా, మిగిలిన వారంతా నామినేషన్లకు ఏర్పాట్లు చేసుకున్నారు. అభ్యర్థుల నామినేషన్‌ కార్యక్రమాలకు హాజరవుతున్న ప్రధాన పార్టీల ముఖ్య నేతలు భారీ ర్యాలీలు, రోడ్‌ షోలు, బహిరంగ సభలతో శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.

Lok Sabha Elections Nominations
Lok Sabha Elections Nominations

సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో కొనసాగుతున్న నామినేషన్లు-భారీ ర్యాలీలు, బహిరంగ సభలతో బిజీబిజీ

Lok Sabha Elections Nominations : ఎన్నికల సమరంలో కీలకఘట్టమైన నామినేషన్ల పర్వం చివరి దశకు చేరుకుంది. ఈ నెల 25న గడువు ముగియనుండగా ఆలోగా అన్ని స్థానాల్లో అభ్యర్థులు నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఖమ్మం లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించనప్పటీకి ఆ పార్టీకి చెందిన నేత రెండు సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు.

రామసహాయం రఘురాంరెడ్డి తరఫున కాంగ్రెస్‌ నేతలు విడివిడిగా నామపత్రాలు సమర్పించారు. ఖమ్మం రిటర్నింగ్‌ అధికారి గౌతమ్‌కు కాంగ్రెస్‌ నేతలు బొర్రా రాజశేఖర్‌, స్వర్ణకుమారి ఆధ్వర్యంలో ఓ నామపత్రం ఇవ్వగా నూకల నరేశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో మరో నామపత్రం సమర్పించారు. ఖమ్మం స్థానానికి కాంగ్రెస్‌ తమ అభ్యర్థిని ఇంత వరకు అధికారికంగా ప్రకటించనప్పటికీ రఘురాంరెడ్డి తరఫున నామపత్రాలు దాఖలు చేయటంతో ఆయనకే టికెట్‌ ఖరారు కావచ్చని తెలుస్తోంది.

నామినేషన్ దాఖలు చేసిన గడ్డం రంజిత్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న గడ్డం రంజిత్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి రాజేంద్రనగర్‌లోని రిటర్నింగ్ అధికారి శశాంకకు నామినేషన్ పత్రాలు అందజేశారు. తన నామినేషన్ లో రంజిత్ రెడ్డి ఆస్తులు, అప్పుల వివరాలు పేర్కొంటూ రిటర్నింగ్ అధికారికి అఫిడవిట్ సమర్పించారు. తన కుటుంబానికి 435.49 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు వెల్లడించారు. తనపై ఓ క్రిమినల్ కేసూ ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Cong MP Candidate Mallu Ravi Nomination : నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి నామినేషన్‌ వేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి రిటర్నింగ్‌ అధికారికి మల్లు రవి మూడో సెట్‌ నామినేషన్‌ పత్రాన్ని అందజేశారు. రుణమాఫీ అంశంలో సీఎం ప్రకటనపై బీఆర్ఎస్ నేతల విమర్శలను మంత్రి జూపల్లి తిప్పికొట్టారు.

"ఆగష్టు 15లోగా రైతు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా రేవంత్ అనే పద్ధతిలో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు వ్యాఖ్యలు చేశారు. మేము ఆగష్టు 15లోగా రైతుల రుణమాఫీ తప్పకుండా చేస్తాం. ఈ ఎన్నికలు రెఫరెండంగా భావిస్తున్నట్లు సీఎం చెప్పారు"- జూపల్లి కృష్ణారావు, మంత్రి

BJP Boora Narsaiah Goud Nomination : భువనగిరి బీజేపీ అభ్యర్థిగా బూర నర్సయ్యగౌడ్‌ నామపత్రాలు దాఖలు చేశారు. భువనగిరి కలెక్టరేట్‌లోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. నర్సయ్య నామినేషన్‌ కార్యక్రమానికి విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌తో పాటు పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా భువనగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. మోదీ హయాంలోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యపడుతుందన్న కేంద్ర మంత్రి జీ-20 సదస్సు వేళ పోచంపల్లి పట్టుచీరలకు ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తుచేశారు.

BRS MP Candidate kasani Nomination: చేవెళ్ల లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ వేశారు. రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన ఆర్వో కార్యాలయానికి పార్టీ నేతలతో కలిసి వెళ్లిన ఆయన ఎన్నికల అధికారికి నామపత్రాలు సమర్పించారు. అనంతరం, బుద్వేల్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితారెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య పాల్గొన్నారు.

నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామినేషన్ : నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నల్గొండ లక్ష్మీ గార్డెన్స్ నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పార్లమెంటు పరిధిలోని బీఆర్ఎస్ నాయకులు పాల్గోన్నారు. మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవిత, ఆదిలాబాద్‌ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆత్రం సక్కు నామినేషన్లు వేశారు.

144 మంది అభ్యర్థులు - 169 సెట్లు దాఖలు - రాష్ట్రంలో నాల్గో రోజు జోరుగా నామినేషన్లు - Lok Sabha Elections Nominations

నామినేషన్ దాఖలు చేసిన బర్రెలక్క : పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు నామపత్రాలు సమర్పించారు. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా కర్ని శిరీష అలియాస్ బర్రెలక్క నామినేషన్‌ దాఖలు చేశారు. శాసనసభ ఎన్నికల్లో తన గెలుపు కోసం ఎంతో మంది కదిలొచ్చారని ఈ ఎన్నికల్లోనూ తనకు మద్దతునివ్వాలని ఆమె కోరారు.

బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత నామినేషన్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత నామినేషన్‌ వేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి కంటోన్మెంట్ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి ఆమె నామినేషన్‌ పత్రాలు అందజేశారు. అంతకు ముందు కాకాగూడాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో తన తండ్రి, దివంగత నేత సాయన్న చిత్రపటానికి ఆమె నివాళి అర్పించారు.

57 మంది అభ్యర్థులు - 69 నామినేషన్లు - రాష్ట్రంలో రెండో రోజు నామినేషన్ల సందడి - Lok Sabha Elections Nominations

42 మంది అభ్యర్థులు - 48 నామినేషన్లు - రాష్ట్రంలో తొలి రోజు నామినేషన్ల సందడి - LOK SABHA ELECTIONS NOMINATIONS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.