ETV Bharat / politics

ఓట్ల సంఖ్య పెరిగినా - పోలింగ్ శాతం మాత్రం పడిపోతుంది - సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్​పై జనం అనాసక్తి - Lok Sabha Polls 2024 - LOK SABHA POLLS 2024

Lok Sabha Polling Percentage Decrease in Telangana : హక్కున్న ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకుని ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటేనే అది నిజమైన ఎన్నిక. కానీ స్థానిక సంస్థలు, అసెంబ్లీతో పోల్చుకుంటే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్​పై జనంలో ఆసక్తి తగ్గుతోంది. లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి సగటున 5 నుంచి 10 శాతం వరకూ పడిపోతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లా ఓటింగ్‌ లెక్కలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

Polling Percentage Decrease in Telangana
Lok Sabha Polling Percentage Decrease in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 12:14 PM IST

Lok Sabha Polling Percentage Decrease in Telangana : శాసనసభ ఎన్నికలతో పోల్చుకుంటే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల సంఖ్య గణనీయంగా పెరిగినా, పోలింగ్ శాతం మాత్రం పడిపోతూ వస్తోంది. స్థానిక సంస్థలు, శాసనభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్న ఓటర్లు లోక్‌సభకు వచ్చేసరికి పెద్దగా ఉత్సాహం చూపడం లేదు. గత శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. 2018 డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ పరిధిలోని 7 శాసనసభ స్థానాల్లో 80.52 శాతం పోలింగ్‌ నమోదైంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు మాత్రం 65.30 శాతానికి పడిపోయింది. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానంలోనూ అదే పరిస్థితి నెలకొంది. 2018 శాసనసభ ఎన్నికల్లో 75.67 శాతం పోలింగ్‌ నమోదు కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో 62.51 శాతానికే పరిమితమైంది.

Lok Sabha Polls 2024 : స్థానిక సంస్థలు, శాసనసభ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పడిపోవడానికి అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 90శాతానికి పైగా ఓటింగ్‌ నమోదవుతోంది. సర్పంచ్‌, ఎంపీటీసీ, జెట్పీటీసీ, పురపాలక ఎన్నికలకు స్థానిక నేతలు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ప్రచారం చేస్తారు. ఒక్క ఓటు తక్కువైనా ఓటమి తప్పదన్న ఆందోళన అభ్యర్థుల్లో ఉంటుంది. వలస ఓటర్లను సైతం రప్పించి ఓటేసేలా కృషిచేస్తారు. అసెంబ్లీ ఎన్నికలను కూడా అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి.

ఎన్నికల శిక్షణకు 10 మంది అధికారులు డుమ్మా- క్రిమినల్ కేసులు నమోదు - Criminal Cases Against Absent Staff

ఓటువేసేవారు పెరిగిన తగ్గుతున్న ఓటింగ్: ప్రజలు కూడా తమ జీవితాలను మార్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే భావనతో ఓటింగ్‌లో పాల్గొంటారు. ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి ఎమ్మెల్యేల నుంచి కింది స్థాయి కార్యకర్తలకు వరకు పెద్దగా దృష్టి సారించడం లేదు. బూత్​స్థాయి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు సైతం ప్రచారం (Lok Sabha Election Campaign) చేయాల్సిన వారు ఆసక్తి చూపించడం లేదు. ఓటర్లు సైతం ఈ ఎన్నికలపై ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్‌ శాతం తగ్గుతోందని అధికారులు చెబుతున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గినా ఓటర్ల సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ పరిధిలో 15లక్షల ఓటర్లు ఉన్నారు. అదే 2024 ఎన్నికల సమయానికి ఓటర్ల సంఖ్య 16లక్షల 80 వేలకు చేరింది. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ పరిధిలో 2019లో 15లక్షల 88 వేల మంది ఓటర్లు ఉండగా 2024 నాటికి ఆ సంఖ్య 17లక్షల 37వేలకు చేరింది. రెండు నియోజకవర్గాల్లో 10.67 శాతం ఓటర్లు పెరిగారని అధికారులు వెల్లడించారు.

ఆన్​లైన్​ ద్వారా కూడా నామినేషన్లు వేయొచ్చు - ప్రతి అభ్యర్థి ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాల్సిందే : వికాస్​రాజ్​ - CEO Vikas Raj on Nominations

అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న ఈసీ అధికారులు : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల అధికారులు స్వీప్‌ ద్వారా ఓటింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక కేటగిరిలో దివ్యాంగులు, వృద్ధులు, సర్వీస్‌ ఓటర్లపై దృష్టి సారించారు. 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 40 శాతానికి పైగా వైకల్యం కల్గిన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటేసేలా ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. యువతను ఓటింగ్ వైపు మళ్లించేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఎన్నికల ప్రచారానికి కోట్లలో ఖర్చు - పైసలిస్తేనే ప్రచారానికి వస్తామంటున్న స్థానిక నేతలు - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.