ETV Bharat / politics

తెలంగాణలో లోక్​సభ ఎన్నికల హీట్ - ప్రచారాల్లో జోరు పెంచిన ప్రధాన పార్టీలు - LOK SABHA ELECTIONS 2024 - LOK SABHA ELECTIONS 2024

Lok Sabha Elections Campaign in Telangana‍ 2024 : సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో త్వరలోనే నోటిఫికేషన్‌ వెలువడనుండగా, ప్రధాన పార్టీలు ప్రచారాల జోరు పెంచుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు ఊరూవాడ చుట్టేస్తుండగా, ముఖ్య నాయకులు రంగంలోకి దిగుతున్నారు. నామినేషన్ల దాఖలుకు ముహూర్తం ఖరారు చేసుకుంటున్న వారు, అగ్ర నేతలను ఆహ్వానిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, రోడ్‌ షోలు, ర్యాలీలుగా ప్రజల్లోకి వెళ్తున్న అభ్యర్థులు, తమకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు.

ts lok sabha polls 2024
ts lok sabha polls 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 8:48 AM IST

ప్రచారం జోరు పెంచిన పార్టీలు

Lok Sabha Elections Campaign in Telangana‍ 2024 : రాష్ట్రంలో మెజార్టీ లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నాయకత్వం సమరశంఖం పూరించగా అభ్యర్థులు, వారికి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం సాగిస్తున్నారు. అంబర్‌పేటలో జరిగిన హస్తం పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆ పార్టీ సికింద్రాబాద్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ హాజరయ్యారు.

Congress Lok Sabha Election Campaign 2024 : మేడ్చల్‌ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ (Congress Strategy on MP Elections) ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆ పార్టీ మల్కాజిగిరి అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. కొంపల్లి యాదిరెడ్డిబండలో ఏర్పాటు చేసిన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, బల్మూరి వెంకట్‌తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ హస్తం పార్టీ నియోజకవర్గ సమావేశానికి జిల్లా ఇంఛార్జి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌, బీజేపీలపై ఆమె విమర్శలు గుప్పించారు.

గెలుపే లక్ష్యంగా లోక్​సభ ఎన్నికల ప్రచారం - విమర్శలు ప్రతి విమర్శలతో వేడెక్కుతున్న రాజకీయం - Lok Sabha Elections 2024

బీజేపీ మేనిఫెస్టోకి దిక్కులేదు : సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమాశానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే సామెల్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్ రెడ్డి గెలుపు కోసం సమష్టిగా సాగాలని కోరారు. దేవుడి పేరుతో బీజేపీ బస్తీల్లో రాజకీయం చేస్తోందని ఇప్పటికీ ఆ పార్టీ మేనిఫెస్టోకి దిక్కులేదని కాంగ్రెస్ మీడియా కమిటీ ఛైర్మన్‌ సామ రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన హస్తం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యారు. పదేళ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్‌, దేశాన్ని కమలం పార్టీ నాశనం చేశాయని ఆరోపించారు. పెద్దపల్లి అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలని ఆయన కోరారు.

BRS Election Campaign 2024 : మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్‌కు (BRS Focus on Lok Sabha Polls) ప్రతిష్టాత్మకంగా మారటంతో చావోరేవో తేల్చుకునేందుకు ఆ పార్టీ నాయకులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హాజరయ్యారు. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌లో జరిగిన గులాబీ పార్టీ సమావేశానికి ఆ పార్టీ నల్గొండ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లో జరిగిన రోడ్‌ షోలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. కరీంనగర్‌లో భారత్ రాష్ట్ర సమితిని ఓడించేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికపై కావాలనే తాత్సారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

BJP Election Campaign 2024 : అటు లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలదళం (BJP Lok Sabha Election Campaign) ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ రోడ్‌షో నిర్వహించారు. హామీలు అమలుచేయకుండా 4నెలల్లోనే కాంగ్రెస్‌ చేతులెత్తేసిందన్న ఆయన, దేశంలో ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. చేవెళ్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో చేపట్టిన ప్రజాఆశీర్వాద సభ ముచ్చింతల్‌కు చేరుకుంది.

నల్గొండ జిల్లా చండూర్‌లో నేతన్నల భరోసా యాత్రలో భాగంగా భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. నేతన్నల సంక్షేమానికి కేంద్రం ఎన్ని పథకాలు తెచ్చినా, రాష్ట్ర ప్రభుత్వ తీరుతో వారికి అందలేదన్నారు. కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ అభ్యర్థిగా ఈ నెల 19న నామినేషన్‌ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హాజరుకానున్నారు.

పోటాపోటీగా లోక్​సభ ఎన్నికల ప్రచారాలు - గెలుపే లక్ష్యంగా పోటీపడుతున్న అధికార, విపక్ష పార్టీలు - Lok Sabha Elections 2024

కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్ లోపాయికారిగా పది, ఒక్కటి, ఆరు సీట్లుగా పంచుకుని పోటీ చేస్తున్నారని కమలం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్‌ ప్రభాకర్ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో ఓబీసీ కుల సంఘాలతో జరిగిన సమావేశానికి మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ హాజరయ్యారు. చట్టసభల్లో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత బీజేపీదేనన్న ఆయన మూడోసారి మోదీని గెలిపించేందుకు కదలాలని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు మధ్య లోపాయికారి ఒప్పందం : వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలో కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. జగిత్యాల మంచినీళ్ల బావి సమీపంలో కమలం పార్టీ నిజామాబాద్ అభ్యర్థి అర్వింద్‌ చాయ్‌పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. 47 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలకు జీవన్‌రెడ్డి చేసిందేంటో చెప్పాలని ఆయన నిలదీశారు. ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు భారీ ర్యాలీ నిర్వహించారు.

తాను ఎంపీగా గెలిచిన తర్వాత పాలమూరు-రంగారెడ్డికి తప్పకుండా కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తానని కమలం పార్టీ మహబూబ్‌నగర్‌ అభ్యర్థి డీకే అరుణ తెలిపారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆమె పాలమూరు-రంగారెడ్డి కోసం రేవంత్‌రెడ్డి ఏనాడైనా పోరాటం చేశారా అని ప్రశ్నించారు. మాతృప్రేమతో పరిపాలన అనే నినాదంతో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీచేస్తున్నట్లు ఇండియన్ ప్రజాకాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కె.బి.శ్రీధర్ పేర్కొన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార జోరు - హాట్ ​హాట్​గా అగ్రనేతల ప్రసంగాలు - Lok sabha elections 2024

రసవత్తరంగా లోక్​సభ ఎన్నికల రాజకీయం - పోటాపోటీగా ప్రధాన పార్టీల ప్రచారం - LOK SABHA ELECTIONS 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.