Leaders Prediction on Lok Sabha Election : లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జననాడి ఈవీఎంలలో నిక్షిప్తం చేసింది. వచ్చే నెల 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ఈ లోపుగానే ఎవరి అంచనాల్లో వారు మునిగిపోయారు. ప్రధాన పార్టీలైనా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పోలింగ్ సరళిని అంచనావేస్తూ గెలుపుపై లెక్కలు వేసే పనిలో పడ్డాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో విజయం తమదేనని విశ్వాసంతో ఉంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ప్రజలు తమకే అనుకూలమైన తీర్పునిచ్చారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 12 నుంచి 14 పార్లమెంట్ స్థానాలు గెలిచి దేశంలోనూ ఇండి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
"రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో 12 నుంచి 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. దేశంలో రాహుల్ గాంధీ చేసిన బస్సుయాత్ర, పాదయాత్ర ద్వారా ప్రజాస్వామం కోసం పోరాడారు. ఎన్నికల్లో ఫలితాల తర్వాత ఇండియా కూటమి అధికారాన్ని చేపడతుంది. అనంతరం దేశ సంపదను ప్రజలకు పంచి పెడతాం. అభివృద్ధి చేస్తాం."-భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి
Political Leaders Confidence on Results : రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు వైఫల్యాలే తమ విజయానికి కారణమవుతాయని బీఆర్ఎస్ విశ్వాసం వ్యక్తం చేసింది. గెలుపు తమదేనని ఆ పార్టీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు బీఆర్ఎస్కి మద్దతుగా నిలిచారని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. రెండు జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించామని మూడు పార్టీల్లో అధిక ఎంపీ సీట్లు వస్తాయన్నారు.
BJP Leaders on Election Results : రాష్ట్రంలో మెజార్టీ స్థానాల్లో ప్రజలు తమకు అనుకూలంగా తీర్పునిచ్చారని బీజేపీ ఫూర్తి విశ్వాసంతో ఉంది. వరంగల్‌లో మోదీ ప్రధాని కావాలన్న దేశ ప్రజల కాంక్ష ముందు కాంగ్రెస్ కుయుక్తులు పని చేయలేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు. 2 నుంచి 3 లక్షల మెజార్టీతో గెలుస్తామని మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డి.కె.అరుణ ధీమా వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారాలతో బిజీగా గడిపిన నాయకులు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మేనల్లుడితో కలిసి రిలాక్స్ అవుతున్నారు. మారథాన్‌లాంటి ప్రచారం తర్వాత ఫ్యామిలీ టైమ్ అంటూ సంజయ్ ట్వీట్ చేశారు.
మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో విజయం బీజేపీదే : డీకే అరుణ - DK ARUNA ON MAHABUBNAGAR MP SEAT