ETV Bharat / politics

'కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది - నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది' - KTR Tweet On COngress - KTR TWEET ON CONGRESS

KTR Tweet On Congress Ruling in Telangana : కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో అన్ని వర్గాల ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి, పాలన పగ్గాలు చేపట్టారని విమర్శించారు.

Lok Sabha Election 2024
KTR Tweet On Congress Ruling in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 12:00 PM IST

KTR Tweet On Congress Ruling in Telangana : కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన విధానంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. అన్ని వర్గాల ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి పాలన పగ్గాలు చేపట్టారని మండిపడ్డారు. 120 రోజుల్లో నిరుద్యోగులు సహా అందరికీ ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తామని ప్రియాంక గాంధీతో చెప్పించి, ఇప్పుడు అలాంటి మాటే మాట్లాడలేదని భట్టి మాట మార్చారన్నారు. కాంగ్రెస్ హామీలు ఇచ్చింది కానీ, వాటిని అమలు చేయడంలో విఫలమైందని అన్నారు.

'కాంగ్రెస్​కు రైతుల ప్రయోజనం కంటే - రాజకీయమే ముఖ్యమని మరోమారు తేలిపోయింది' - ktr today tweet on Medigadda

"ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వార్తా పత్రికల మొదటి పేజీలో తమ జాబ్ క్యాలెండర్‌ గురించి ప్రకటనలు ఇచ్చింది. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి, ఆ ఉద్యోగాలను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటోంది కాంగ్రెస్. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ తాము ఇచ్చిన హామీపై నిస్సిగ్గుగా యూ టర్న్ తీసుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ పరీక్ష ఫీజును రూ.400 నుంచి రూ.2000లకు (2 పేపర్లకు) పెంచింది." అని కేటీఆర్ ట్విటర్ వేదికగా అన్నారు.

Lok Sabha Election 2024 : గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను కాంగ్రెస్ నిస్సుగ్గుగా తన ఖాతాలో వేసుకుందని కేటీఆర్ చురకలంటించారు. బల్మూరి వెంకట్ కోర్టులో కేసులు వేయడం వల్ల పలు ఉద్యోగ నోటిఫికేషన్లు రద్దయ్యాయన్న కేటీఆర్, ఆయనకు మాత్రం ఎమ్మెల్సీ వచ్చింది కానీ ఉద్యోగభ్యర్థుల పరిస్థితి మాత్రం దిక్కుతోచకుండా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అసలు రంగు బయటపడుతోందని, ఆ పార్టీ బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్​ రెడ్డి : కేటీఆర్ - KTR Interesting Comments on Revanth

'బల్మూరి వెంకట్ వంటి కాంగ్రెస్ నాయకులను ఎన్నో కోర్టు కేసులు వేసి, అనేక పోటీ పరీక్షలు రద్దవ్వడానికి కారణమయ్యారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుని, ప్రతిఫలంగా వెంకట్ ఎమ్మెల్సీ పదవిని అందుకున్నాడు. కానీ ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులను మాత్రం దిక్కుతోచని స్థితిలో వదిలేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. తమను నట్టేట ముంచిన కాంగ్రెస్‌ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది.' అని కేటీఆర్ ఎక్స్ వేదికగా అన్నారు.

ప్రజలారా మేల్కొండి - వాళ్ల కుట్రలను అర్థం చేసుకోండి : కేటీఆర్​ - Ambedkar Jayanthi Celebrations

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.