KTR Fires on Congress Party : భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావును కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పార్టీ ఫిరాయింపులపై రాహుల్ తుక్కుగూడలో ఎన్నో మాట్లాడారని, ఇవాళ గులాబీ పార్టీ ఎమ్మెల్యేను చేర్చుకున్నారని అన్నారు. ఈ డ్రామాలు దేనికంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
అది జన జాతర కాదు - హామీల పాతర, అబద్ధాల జాతర సభ : కేటీఆర్ - KTR Tweet On Congress Party
పార్టీ ఫిరాయిస్తే అనర్హులయ్యేలా చట్ట సవరణ చేస్తామని మేనిఫెస్టోలో (Congress Manifesto) హామీ ఇచ్చి, ఇప్పుడు ఇదేం తీరంటూ ఎండగట్టారు. గెలిచేంత వరకు ఒక మాట, గెలిచాక ఇంకో మాట, ఇదే కాంగ్రెస్ నీతి అని ధ్వజమెత్తారు. మరి దేశంలో భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్‌కు తేడా ఏంటో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.
ప్రభుత్వ వైఫల్యంతో నేతన్నలు రోడ్డున పడ్జారు : కపట కాంగ్రెస్ పాలనలో కడుపునింపే అన్నదాత ఆగమయ్యాడని, చేనేత కార్మికుడు చితికిపోతున్నాడని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా చేనేత కార్మికుల పరిస్థితులపై ఆయన స్పందించారు. ప్రభుత్వ వైఫల్యం(Government Failure), పాలకుడి నిర్వాకం వల్ల ప్రతి నేతన్న నడిరోడ్డు మీద పడ్డాడని అన్నారు. నాడు తెలంగాణ అవకాశాల గని, చేనేత కార్మికుడికి చేతినిండా పని అన్న కేటీఆర్, నేడు చేతకాని కాంగ్రెస్ పాలన, కార్మికుల పాలిట శని అని ఆరోపించారు.
బతుకమ్మ చీరల ఆర్డర్లకు అడ్రస్ లేదని, ప్రభుత్వ పెండింగ్ బిల్లులకు మోక్షం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. అసమర్థ పాలనలో దిక్కుతోచని నేతన్నకు, చేసేందుకు పనిలేదని, తినేందుకు తిండి లేదని ఆక్షేపించారు. బీఆర్ఎస్ తెచ్చిన రాయితీ పథకాన్ని రాగానే సమాధి చేశారని, చేనేత మిత్ర పథకానికి(Chenetha Mitra Scheme) నిలువునా పాతరేశారని ఆక్షేపించారు. ఇలా ఇంకెంతకాలం అన్యాయాల జాతర చేస్తారని ప్రశ్నించారు.
KTR Tweet on Handloom : దిల్లీలోని బడే - బాయ్ జీఎస్టీ దెబ్బకు చేనేతరంగం కుదేలైందని, గల్లీలోని చోటే - బాయ్ నిర్లక్ష్యానికి నిలువునా బలైందని ఆరోపించారు. చేనేత కార్మికులను (Handloom Workers) చిన్నచూపు చూస్తున్న భస్మాసుర హస్తానికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మూలనపడ్డ మగ్గం సాక్షిగా హెచ్చరిస్తున్నట్లు కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు.
సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ - ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ట్వీట్