ETV Bharat / politics

బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో మూడు రోజులు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు : కేటీఆర్ - KTR on Telangana Formation Day

Telangana Formation Day 2024 : బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నట్లు కేటీఆర్​ తెలిపారు. ఈ వేడుకలో ప్రతి తెలంగాణ బిడ్డ పాల్గొనాలని సూచించారు. తెలంగాణ అంటే కేసీఆర్​, టీఆర్​ఎస్​ అని పేర్కొన్నారు. జూన్​ 1న గన్​పార్కు నుంచి అమరజ్యోతి స్తూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

author img

By ETV Bharat Telangana Team

Published : May 28, 2024, 8:28 PM IST

Updated : May 28, 2024, 8:36 PM IST

Telangana Formation Day 2024
Telangana Formation Day 2024 (ETV Bharat)

KTR on Telangana Formation Day : భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పాల్గొనాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ఆహ్వానించారు. ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ అంటే కేసీఆర్​, బీఆర్​ఎస్​ అని పేర్కొన్నారు.

దశాబ్దాల స్వరాష్ట్రం కలను సాకారం చేసిన పార్టీగా బీఆర్​ఎస్​ నిలుస్తోందన్నారు. ఇందుకోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరణ నిరాహార దీక్ష చేసి అనేక పోరాటాలు, త్యాగాలతో తెలంగాణను సాధించుకున్న కేసీఆర్​ ఆధ్వర్యంలో మూడు రోజుల కార్యక్రమాలను విజయవంతం చేద్దామని పార్టీ శ్రేణులకు కేటీఆర్​ పిలుపునిచ్చారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఎక్కడికక్కడ ఘనంగా నిర్వహించాలని కేటీఆర్​ విజ్ఞప్తి చేశారు.

జూన్​ 1 : మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా జూన్​ ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటలకు గన్​ పార్క్​లోని అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్​ బండ్​ వద్ద ఉన్న అమరజ్యోతి వరకు అమరవీరులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్​ఎస్​ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ హాజరవుతారన్నారు. వారితో పాటు తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కానున్నట్లు చెప్పారు.

జూన్​ 2 : జూన్​ రెండో తేదీన పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్​లో ఆవిర్భావ దినోత్సవ సంబురాలను నిర్వహించనున్నట్లు కేటీఆర్​ పేర్కొన్నారు. ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను పార్టీ అధినేత కేసీఆర్​ ఎగరవేస్తారన్నారు. అనంతరం పార్టీ శ్రేణుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారని చెప్పారు.

జూన్​ 3 : మూడో తేదీన జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో సమావేశాలు, పార్టీ జెండా ఆవిష్కరణ, అనంతరం పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్​ పిలుపునిచ్చారు. పార్టీ ప్రకటించిన కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా చూడాలని, దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు.

గన్​పార్కు నుంచి అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో ఉద్యమ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్​ గెల్లు శ్రీనివాస్​ తెలిపారు. బీఆర్​ఎస్​ అధ్యక్షుడు కేసీఆర్​ నిర్ణయం మేరకు గన్​పార్కు నుంచి అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించునున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీ అనుమతి కోసం జీహెచ్​ఎంసీ కమిషనర్​ కలిశారు.

చార్మినార్​ చిహ్నమంటే మీకెందుకంత చిరాకు - కాకతీయ కళాతోరణం అంటే ఎందుకంత కోపం : కేటీఆర్​ - KTR Tweet on CM Revanth Reddy

తెలంగాణలో వచ్చిన మార్పు - బీఆర్​ఎస్​ నేతలను హత్య చేయడమేనా? : కేటీఆర్ - KTR in MLC By Election Campaign

Last Updated : May 28, 2024, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.