ETV Bharat / politics

సీఎం గుంపు మేస్త్రీ అయితే ప్రధాని తాపీ మేస్త్రీ - ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు : కేటీఆర్ - KTR Satires on CM Revanth PM Modi

KTR Comments on CM Revanth and PM Modi : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, ప్రధానమంత్రి మోదీపై బీఆర్​ఎస్​ నిర్వహక అధ్యక్షుడు కేటీఆర్​ మరోసారి సెటైరికల్​ కామెంట్స్​ చేశారు. రాష్ట్రంలో 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్​, పదేళ్లు దేశాన్ని నడిపిన మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని కేటీఆర్​ వ్యాఖ్యానించారు. సీఎం గుంపు మేస్త్రీ అయితే ప్రధాని తాపీ మేస్త్రీ అని, ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రెండు జాతీయ పార్టీలు కలిసినా, గులాబీ పార్టీని ఏమీ చేయలేవని స్పష్టంచేశారు.

KTR Comments on Congress BJP
KTR Comments on CM Revanth and PM Modi
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 10, 2024, 3:48 PM IST

Updated : Apr 10, 2024, 8:18 PM IST

KTR Comments on CM Revanth and PM Modi : లోక్​సభ ఎన్నికల్లో ఒక్క స్థానమైనా గెలవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్​కు బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. ఇద్దరమూ రాజీనామా చేసి మల్కాజ్​గిరి బరిలో నిలిచి తేల్చుకుందామని ఛాలెంజ్​ చేశారు. ముఖ్యమంత్రి పదవికి, శాసనసభ్యత్వానికి రేవంత్ రాజీనామా చేయాలని, తానూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించారు.

మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో ఘట్​కేసర్ మండల బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి మల్లారెడ్డితో కలిసి పాల్గొన్న కేటీఆర్​, ఈటలకు(Etela Rajender) ఓటు వేసినా ఇక్కడ ఉండరని, హుజురాబాద్​కు వెళ్లిపోతారని అందుకే లోకల్ పార్లమెంట్​ అభ్యర్థి రాగిడిని గెలిపించాలని కోరారు. ఉగాది పచ్చడిలో ఉన్న ఆరు రుచుల మాదిరి జీవితంలో కూడా అన్నీ ఉంటాయని, కొంత మంది నాయకులు పార్టీని వీడినా ఎటువంటి నష్టం లేదని కేటీఆర్​ పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రధాన ప్రతిపక్షం బాధ్యతను సరిగ్గా నిర్వహిస్తున్నామని తెలిపారు.

'కేసీఆర్ ఎత్తుగడలకు ప్రజామోదం లభిస్తుంది - ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి' - BRS Party Ugadi Celebrations 2024

కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన ఖర్మ మాకు లేదు : కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్న ఆయన, 420 హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనిక్కి, రైతులకిచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదన్నారు. కాగా కాంగ్రెస్​ ఇచ్చిన హామీలపై నిలదీసిన ప్రతిపక్షాలపై ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటల్లా రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదని ఆక్షేపించారు. రేవంత్ ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానన్న కేటీఆర్​, కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన ఖర్మ తమకు లేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ​లో రాహుల్, రేవంత్ రెండు నాలుకలు : ఫోన్ ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ మంచినీళ్ల మీద పెట్టాలని ముఖ్యమంత్రిని సూచించారు. రైతు బంధు, దళిత బంధు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, బతుకమ్మ చీరలు సహా అన్ని రద్దు చేశారని ఈ సందర్భంగా తెలిపారు. రాహుల్ భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) అని దేశమంతా తిరుగుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం ప్రధాని మోదీ తన పెద్దన్న అంటు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కామ్ జరగలేదని రాహుల్ అంటే, లేదు జరిగిందని రేవంత్ అంటున్నారని, కాంగ్రెస్ పార్టీ​లో రాహుల్, రేవంత్ రెండు నాలుకలని కేటీఆర్​ అభివర్ణించారు.

కాంగ్రెస్​ ఎక్కడైనా ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండదు : హరీశ్​ రావు - Lok Sabha Elections 2024

BRS Leader KTR Fires on BJP : కచ్చితంగా రేవంత్ కేసులు తప్పించుకోవడం కోసం బీజేపీలో చేరుతారని ఆయన ఆరోపించారు. ప్రజలందరూ ఆలోచించి, ఎవరు సంక్షేమ పథకాలు అందించారో వారికి ఓటు వేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.​ పదేళ్లు దేశాన్ని నడిపిన మోదీ(PM Modi) తెలంగాణకు రూపాయి ఇచ్చింది లేదని, ఒక్క రూపాయి కూడా రాష్ట్రంలో రుణమాఫీ చేసింది లేదని అన్నారు. రాముడిని మొక్కుదాం, బీజేపీని తొక్కుదామని కేటీఆర్​ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాముడి పేరు చెప్పుకుని రాజకీయం చేసే బీజేపీని తన్ని, తరిమేద్దామన్నారు.

"పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరడం ఖాయం. అయితే నువ్వు నా జేబులో ఉండాలి, లేకపోతే జైల్లో ఉండాలి తప్ప మధ్యలోనైతే ఉండనీయని నరేంద్రమోదీ మాట. అందుకే ముఖ్యమంత్రిక భయం పట్టుకుంది. అందుకే తానే పార్టీ ఫిరాయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు."-కేటీఆర్​, బీఆర్​ఎస్​ నేత

సీఎం గుంపు మేస్త్రీ అయితే ప్రధాని తాపీ మేస్త్రీ : సీఎం(CM Revanth Reddy) గుంపు మేస్త్రి అయితే ప్రధాని తాపీ మేస్త్రీ అని ఇద్దరు కలిసి తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి ప్రేమ ఉంటే భద్రాచలం రాముడికి ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు. అయోధ్యలో ఉన్నది రాముడే, భద్రాచలంలో ఉన్నది కూడా రాముడే కదా అన్న ఆయన, బీజేపీ మతోన్మాదాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి రాగిడిని గెలిపించాలని ఆయన కోరారు.

ఎమ్మెల్యే సంజయ్​కుమార్​కు కేసీఆర్​ పరామర్శ - KCR condoled death of MLA father

ఉద్యోగులపై ప్రత్యేక దృష్టి పెట్టి - వారికి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చండి : శ్రీనివాస్‌ గౌడ్ - BRS Leader Srinivas Goud

Last Updated : Apr 10, 2024, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.