ETV Bharat / politics

కాంగ్రెస్​లో శిందేలు లేరు - రేవంత్​ రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారు : మంత్రి కోమటిరెడ్డి - Komatireddy Comments On CM Revanth - KOMATIREDDY COMMENTS ON CM REVANTH

Komatireddy Comments On CM Revanth Reddy latest : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్​ రెడ్డి పదేళ్లు పాటు ఉంటారని, కాంగ్రెస్​లో ఏక్​నాథ్​ శిందేలు ఎవరూ లేరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండలో జరిగిన రంజాన్​ వేడుకల్లో పాల్గొన్న ఆయన బీఆర్​ఎస్​, బీజేపీ పార్టీలపై విమర్శలు చేశారు.

Komati reddy
Komati reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 11, 2024, 2:15 PM IST

రేవంత్​ రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారు - కాంగ్రెస్​లో ఏక్​నాథ్​ శిందేలు లేరు : మంత్రి కోమటిరెడ్డి

Komatireddy Comments On CM Revanth Reddy latest : రేవంత్​ రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారని ఆర్​ అండ్​ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్​లో ఏకనాథ్​ శిందేలు ఎవరూ లేరన్నారు. అందరం రేవంత్​ రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్నామని చెప్పారు. బీజేపీ మతాలు, కులాలు మధ్య చిచ్చు పెడుతుందని ధ్వజమెత్తారు. నల్గొండలోని ఈద్​గా దర్గాకు వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి అక్కడి ముస్లిం సోదరులతో కలిసి రంజాన్​ వేడుకల్లో(Ramadan Celebrations 2024) పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మంత్రి వెంట కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నేత జానారెడ్డి, ముఖ్య నాయకులు ఉన్నారు.

అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్​లో ఏకనాథ్​ శిందేలు ఎవరూ లేరని, తామంతా కలిసికట్టుగా రేవంత్​ రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్నామని స్పష్టం చేశారు. రేవంత్​ రెడ్డి మరో పదేళ్లు సీఎంగా ఉంటారని తెలిపారు. హరీశ్​రావు, మహేశ్వర్​ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. బీఆర్​ఎస్​కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని జోస్యం చెప్పారు.

'మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్​లోకి వస్తానన్నాడు - పట్టించుకోకపోయేసరికి ఇలా మాట్లాడుతున్నాడు'

Minister Komati Reddy Fires on BRS : బీఆర్​ఎస్​ ఒక్క సీటు గెలిస్తే తాను దేనికైనా సిద్ధమే అంటూ మంత్రి కోమటిరెడ్డి సవాల్​(Komati Reddy Challenge to BRS) విసిరారు. కాంగ్రెస్​ అంతర్గత విషయాలు మహేశ్వర్​ రెడ్డి మాట్లాడొద్దని హెచ్చరించారు. సంజయ్​ను ఎందుకు మార్చారో మహేశ్వర్​ రెడ్డికి తెలుసా అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి ప్రశ్నించారు.

"కులాలు, మతాల మధ్య ఘర్షణలు పెట్టడం దానికి మాకు 370 నుంచి 400 సీట్లు వస్తాయని రాజకీయం చేస్తున్నారు. బీఆర్​ఎస్​ కార్యక్రమంలో జనాలు లేక హరీశ్​రావు ప్రస్టేషన్​లో ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు అని అన్నారు. బీజేపీ నేత మహేశ్వర్​ రెడ్డి కాంగ్రెస్​లోనే ఐదు గ్రూపులు ఉన్నాయని చెబుతున్నారు. ఇలా విమర్శలు చేస్తున్నవారు విజ్ఞతతో మాట్లాడాలి. ఇక్కడ అందరం సీఎం రేవంత్​ రెడ్డి ఆధ్వర్యంలో ఒక టీంగా పని చేస్తున్నాము. మీరు ఏక్​నాథ్​ శిందే అనే పదం సృష్టించారు. సీఎంగా రేవంత్​ రెడ్డినే పదేళ్లు అధికారంలో ఉంటారు. బండి సంజయ్​ను దించేసి కిషన్​రెడ్డిని ఎందుకు అధ్యక్ష పీఠంపై కూర్చో బెట్టారో నీకు తెలుసా? మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడూ మాట్లాడవద్దు." - కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, మంత్రి

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​ ఒక్క సీటూ గెలవదు: మంత్రి కోమటిరెడ్డి

దానం నాగేందర్​ను లక్ష లేదా రెండు లక్షల మెజారిటీతో గెలిపించుకుంటాం : మంత్రి కోమటిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.