Kishan Reddy on Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో అన్ని రకాల దోపిడీలు జరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. అబద్ధాలతోనే కేసీఆర్ రాజకీయాలు నడిపించారని, ప్రజలను మభ్యపెట్టి పదేళ్లు పాలన సాగించారని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో గతంలో బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కేసుపై ఉన్నత స్థాయి దర్యాప్తు, న్యాయ విచారణ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
పోలీస్ అధికారులు మాఫియాగా ఏర్పడి ఫోన్ ట్యాపింగ్ చేశారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోన్ల ట్యాపింగ్‌కు బాధ్యత గత ముఖ్యమంత్రిదేనని స్పష్టం చేశారు. ఫోన్లు ట్యాపింగ్ చేసి, బ్లాక్ మెయిల్ చేసి రూ.కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. తమ పార్టీ కార్యాలయంలోని ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోందన్న ఆయన, ఎన్నికల సమయంలో బీజేపీ అధికారిక అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకుని వస్తుంటే ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీసులు చుట్టుముట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
''ఫోన్ ట్యాపింగ్'లో కొందరినే బాధ్యులు చేయడం సరికాదు - ఆ ముగ్గురిని నిందితులుగా చేర్చాలి'
Kishan Reddy on BRS MLC Kavitha Arrest : మరోవైపు దిల్లీ మద్యం వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కక్ష సాధింపులో భాగంగా భారతీయ జనతా పార్టీ కవితను అరెస్టు చేయించిందని ఆరోపిస్తున్నారన్న ఆయన, ఈ విషయంపై బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. పార్టీపై చేస్తున్న ఆరోపణలపై తాము స్పందించాల్సి ఉందన్న కిషన్ రెడ్డి, కేసీఆర్ కుటుంబ అవినీతిని ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో నేనూ ఉన్నాను : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
కక్ష సాధింపులో భాగంగా కవితను అరెస్టు చేశారని అంటున్నారు. దిల్లీ మద్యం వ్యాపారంలో కవిత జోక్యం చేసుకున్నారా? లేదా? వ్యాపార సంస్థ ఏర్పాటు చేసి బినామీలను పెట్టారా? లేదా? కవిత కనుసన్నల్లో దిల్లీ మంత్రులతో చర్చలు జరిపారా? లేదా? దిల్లీ మద్యానికి సంబంధించి రూ.కోట్లు చేతులు మారాయా? లేదా? అనే విషయంలో కేసీఆర్ స్పందించాలి. - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
తిహాడ్ జైలుకు ఎమ్మెల్సీ కవిత - ఇంటి నుంచే భోజనం, మంచం, పరుపులకు వెసులుబాటు