ETV Bharat / politics

భారత్​ మాల, ఆర్​ఆర్​ఆర్​ ప్రాజెక్ట్​లపై సీఎం రేవంత్​కు కిషన్​ రెడ్డి లేఖ

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2024, 5:29 PM IST

Updated : Jan 24, 2024, 7:17 PM IST

Kishan Reddy Letter to CM Revanth Reddy on Bharat Mala Project : కేంద్రమంత్రి కిషన్​రెడ్డి భారత్​ మాల, రీజినల్​ రింగ్​ రోడ్డు భూసేకరణపై సీఎం రేవంత్​ రెడ్డికి లేఖ రాశారు. గత ప్రభుత్వంలో వాటిని పట్టించుకోలేదని, ఇప్పటికైనా ఆ ప్రాజెక్టు​ల పనులు వేగవంతం చేయాలని కోరారు. ఆర్​ఆర్​ఆర్ భూసేకరణ కోసం 50 శాతం నిధులు ఇవ్వాలని సూచించారు.

Bandi sanjay Letter to Revanth Reddy on Sarpanch Pending Bills
Kishan Reddy Letter to CM Revanth Reddy

Kishan Reddy Letter to CM Revanth Reddy on Bharat Mala Project : రాష్ట్రంలో భారత్​ మాల, రీజినల్​ రింగ్​ రోడ్డు భూసేకరణపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి(Central Minister Kishan Reddy) సీఎం రేవంత్​ రెడ్డికు లేఖ రాశారు. భారత్ మాల కింద నిర్మించే రోడ్లకు భూసేకరణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఆర్​ఆర్​ఆర్​ భూసేకరణ కోసం 50 శాతం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్​ ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రాజెక్టులు ఆలస్యం చేయకుండా పనులు వేగవంతం చేయాలని కిషన్​ రెడ్డి కోరారు.

Kishan Reddy on National Highways in Telangana : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రూ.లక్ష కోట్లకు పైగా వెచ్చించి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులను నిర్మించిందిని కిషన్​రెడ్డి గుర్తు చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో సామాజిక, పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి దోహదపడ్డాయని వివరించారు. చాలా ప్రాంతాల్లో ఉన్న ట్రాఫిక్​ సమస్యలు కూడా తొలగిపోయాయని హర్షం వ్యక్తం చేశారు. ఆ విధంగానే ప్రస్తుతం నిర్మిస్తున్న జాతీయ రహదారులకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తో కేంద్రానికి రోడ్లు నిర్మాణానికి వీలుగా ఉంటుందని సలహా ఇచ్చారు. దీంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా మరింత ముందుకు వెళ్తుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

CM Revanth Reddy on RRR Project : ఈ నెల 16న సీఎం రేవంత్​ రెడ్డి ఆర్ఆర్ఆర్​ భూసేకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మూడు నెలలో పనులు పూర్తి చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు. ఈ పనులు నిర్మాణానికి ఎంత ఆర్థిక భారమైన భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఆర్​ఆర్​ఆర్​లో ఉత్తరం వైపు భూసేకరణతో పాటు టెండర్లు కూడా పిలవాలని పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఓటేస్తే మూసీలో వేసినట్లే : కిషన్ రెడ్డి

Bandi sanjay Letter to Revanth Reddy on Sarpanch Pending Bills : మరోవైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​(MP Bandi Sanjay) కూడా సీఎం రేవంత్​ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో సర్పంచుల పెండింగ్​ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు. సర్కారు అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతున్నా సర్పంచుల బిల్లులపై దృష్టి సారించలేదని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి రాగానే సర్పంచుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇంత వరకు పట్టించుకోక పోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని బండి సంజయ్ లేఖలో డిమాండ్ చేశారు.

15 రోజుల్లో అనంతగిరి పర్యాటక కేంద్రంలో రూ.100 కోట్ల పనులు : కిషన్​ రెడ్డి

ఆదివాసుల అభివృద్ధి పథకానికి రేపు ప్రధాని మోదీ శ్రీకారం : కిషన్‌ రెడ్డి

Last Updated : Jan 24, 2024, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.