ETV Bharat / politics

6 గ్యారంటీలు అమలు చేయకుండా - రాహుల్‌ గాంధీ తెలంగాణ ఎలా వస్తారు? : కిషన్‌ రెడ్డి - Kishan Reddy on Rahul Gandhi

Kishan Reddy Comments on Rahul Gandhi : కాంగ్రెస్​ ఆరు గ్యారెంటీల హామీలను గాలికి వదిలేసిందని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్​ రెడ్డి అన్నారు. హామీలు అమలు చేయలేదు గానీ, రాష్ట్రంలో సభలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇవాళ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన జెండా ఎగురవేశారు.

Kishan Reddy Comments on Congress
Kishan Reddy Comments on Rahul Gandhi
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 6, 2024, 12:53 PM IST

Kishan Reddy Comments on Rahul Gandhi : వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా రాహుల్‌ గాంధీ తెలంగాణకు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారో సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల హామీలను గాలి కొదిలేసిందంటూ ఆయన విమర్శించారు. హామీలు అమలు చేయలేదు కానీ, హామీలకు మించి పెద్ద పెద్ద ప్రకటనలు, సభలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇవాళ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు కె.లక్షణ్​తో కలిసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు.

Kishan Reddy on BJP Formation Day : ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లతో మూడోసారి మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని కిషన్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విశ్వ నాయకుడుగా గుర్తింపు పొందారని ఆయన అన్నారు. ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుందని, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ - అగ్లె బార్ 400 సీట్స్​ అని ప్రతి ఇంటింటా కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని, బీఆర్​ఎస్​ రోజురోజుకూ కనుమరుగవుతుందని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ రెండంకెల సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

'తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది. కాంగ్రెస్​ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితిలో లేదు. గ్యారెంటీల గురించి గాలికి వదిలేశారు. గారడీ మాటలతో కాంగ్రెస్​ ప్రభుత్వం నడుస్తోంది. ఇచ్చిన హామీలు అమలు కాలేదు కానీ హామీల గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. ప్రచారాలు మాత్రమే చేస్తున్నారు. ముఖ్యమంత్రికి హామీల అమలుపై దృష్టి లేదు. పార్టీ ఫిరాయింపుల మీదే దృష్టంతా.'- కిషన్​ రెడ్డి, కేంద్రమంత్రి

గ్యారంటీలు అమలు చేయకుండా రాహుల్‌ తెలంగాణ ఎలా వస్తారు? : కిషన్‌రెడ్డి

BJP Formation day celebrations in Husnabad : మరోవైపు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలోని పార్టీ జెండాను ఎగురవేసి మిఠాయిలు పంచిపెట్టారు. 1980 ఏప్రిల్ 6న ఏర్పడ్డ బీజేపీ, నేడు ప్రపంచంలోని పెద్ద రాజకీయ పార్టీల్లో ఒకటిగా అవతరించిందని ఆ పార్టీ హుస్నాబాద్​ పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ తెలిపారు. 12 కోట్ల మంది సభ్యత్వంతో అతి పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు. భారతీయ జనతా పార్టీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని, అట్టడుగు స్థాయి కార్యకర్తలను ప్రధానిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినాయకత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

గ్యారెంటీలు అమలు చేయకుండా ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్​కు లేదు : కిషన్​రెడ్డి - kishan Reddy Fires On Congress

ఫోన్​ ట్యాపింగ్​ కేసు అంత ఆషామాషీ కాదు - కేసీఆర్​పై కఠిన చర్యలు తీసుకోవాలి : కిషన్​ రెడ్డి - Telangana Phone Tapping Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.