ETV Bharat / politics

ఎన్నికలకు దూరంగా కేసీఆర్ ఫ్యామిలీ - 2001 తర్వాత ఇదే తొలిసారి - KCR Family Distance From Election - KCR FAMILY DISTANCE FROM ELECTION

KCR Family Distance From Lok Sabha Polls 2024 :సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలోని ప్రధాన ఎన్నికలకు కేసీఆర్ కుటుంబం దూరంగా ఉంటోంది. ప్రత్యేకించి 2001 తర్వాత రాష్ట్రంలో జరిగిన దాదాపు ప్రతి ఎన్నికలోనూ కేసీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు పోటీ చేస్తూ వచ్చారు. త్వరలో జరగనున్న లోక్​సభ ఎన్నికల్లో మాత్రం వారు ఎవరూ బరిలో లేరు. దిగువ సభకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పోటీ చేస్తారన్న ప్రచారం ముందు జరిగినా అది జరగడం లేదు.

KCR Family Distance From Lok Sabha Polls 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 25, 2024, 2:37 PM IST

KCR Family Distance From Lok Sabha Polls 2024 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున శాసనభ్యునిగా, మంత్రిగా, శాసనసభ ఉపసభాపతిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) 2011లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. సిద్దిపేట శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉపఎన్నికలో భారీ మెజార్టీతో తిరిగి గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని సిద్దిపేట శాసనసభ స్థానంతో పాటు కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేసి విజయం సాధించారు. సిద్దిపేట శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో వచ్చిన ఉపఎన్నికలో కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు పోటీ చేసి గెలుపొందారు.

KCR Won Mahabubnagar MP Seat in 2009 : ఆ తర్వాత 2006, 2008 ఉపఎన్నికల్లో కరీంనగర్ నుంచి కేసీఆర్ మళ్లీ విజయం సాధించారు 2008 ఉపఎన్నికల్లో హరీశ్ రావు మరోమారు సిద్దిపేట నుంచి గెలిచారు. 2009 ఎన్నికల్లో కేసీఆర్ మహబూబ్‌నగర్ నుంచి లోక్‌సభకు, హరీశ్ రావు (Harish Rao Latest News) సిద్దిపేట నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లోనే కేసీఆర్ తనయుడు కేటీఆర్ సిరిసిల్ల నుంచి పోటీ చేసి విజయఢంకా మోగించారు. 2010 ఉపఎన్నికల్లో హరీశ్ రావు, కేటీఆర్ భారీ మెజార్టీలతో విజయం తీరాలకు చేరారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి, కేటీఆర్ సిరిసిల్ల నుంచి, హరీశ్ రావు సిద్దిపేట నుంచి గెలుపొందారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, కేటీఆర్, హరీశ్ రావు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.

హైదరాబాద్‌ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ - Hyderabad BRS MP Candidate

2014 ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత (MLC Kavitha News Latest) నిజామబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు వారి స్థానాల నుంచి తిరిగి ఎన్నిక కాగా, కవిత ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్‌లో గెలుపొంది కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. కేటీఆర్, హరీశ్ రావు తమ స్థానాల్లో విజయం సాధించారు. కవిత ఆ తరువాత శాసనమండలికి ఎన్నికయ్యారు. తాజాగా జరగనున్న లోక్​సభ ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయడం లేదు.

KCR Family in Elections 2024 : రాష్ట్రంలో అధికారం కోల్పోయిన పరిస్థితుల్లో కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్‌ రావు లోక్‌సభకు పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినా వారెవరూ సార్వత్రిక ఎన్నికల బరిలో దిగడం లేదు. నిజామాబాద్ నుంచి గతంలో ఒకసారి గెలుపొంది, మరోమారు ఓటమిపాలైన కవిత ఈసారి పోటీ చేయడం లేదు. సుదీర్ఘ కాలం తర్వాత కేసీఆర్ కుటుంబసభ్యులు లోక్​సభ ఎన్నికల పోటీకి దూరంగా ఉండడం ఇదే తొలిసారి.

1983లో తొలిసారి శాసనభకు పోటీ చేసి కేసీఆర్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వరుసగా శాసనసభకు ఎన్నికవుతూ వచ్చారు. మధ్యలో కొన్ని లోక్‌సభ ఎన్నికలను మినహాయిస్తే కేసీఆర్ లేదా ఆయన కుటుంబసభ్యులు ఎవరో ఒకరు ప్రతి ఎన్నికలోనూ పోటీ చేస్తూ వస్తున్నారు. కేసీఆర్ బంధువు బోయినపల్లి వినోద్ కుమార్ మాత్రం కరీంనగర్ నుంచి ప్రస్తుతం లోక్ సభ బరిలో నిల్చొంటున్నారు.

కేసీఆర్​ ప్లాన్​​ ఛేంజ్​ - బహిరంగ సభలకు బైబై - బస్సు యాత్రలు, రోడ్​ షోలతోనే ఎన్నికల ప్రచారం

నేతల్లో భరోసా నింపుతూ, లోక్​సభ ఎన్నికలకు సిద్ధం చేస్తూ - 'కారు'ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకొచ్చే పనిలో కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.