ETV Bharat / politics

ఉద్యమాల ఖిల్లాపై ఏ జెండా ఎగురుతుందో? - భయ్యా ఈసారి ఫైట్​ మాత్రం వెరీ టఫ్ - Karimnagar Lok Sabha Election 2024 - KARIMNAGAR LOK SABHA ELECTION 2024

Karimnagar MP Election : ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ పోరాటానికి అడ్డాగా పేరొందిన కరీంనగర్ లోక్‌సభ స్థానంలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. గెలుపు వ్యూహాలతో ఇక్కడ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఈసారి 28 మంది బరిలో నిలిచినా పోటీ మాత్రం ముగ్గురి మధ్యనే ఉండనుంది. దీంతో మూడు ప్రధాన పార్టీలు నువ్వా నేనా? అన్నట్లు ప్రచారాన్ని సాగిస్తూ ప్రత్యర్థి పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. నేతలు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Karimnagar Lok Sabha Election 2024
Karimnagar MP Election (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 8, 2024, 10:06 AM IST

Karimnagar Lok Sabha Election 2024 : కరీంనగర్ జిల్లా ఉద్యమాల ఖిల్లా ఐదు జిల్లాలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించిన ఈ స్థానం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలతో ఏర్పడిన ఈ పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. గతాన్ని చూస్తే ఇక్కడ ఎప్పుడూ ఒకపార్టీ వరసగా రెండుసార్లు గెలిచిన దాఖలాలు లేవు. కమ్యూనిస్టుల నుంచి మెుదలుకొని టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్​ఎస్​ ఇలా ప్రతి పార్టీని ఆదరించిన స్థానమిది.

పార్టీలకతీతంగా అభ్యర్థులను దీవించిన నేల ఇది. కానీ! ఈసారి ఎలగందుల ఖిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఈ స్థానంలో గెలుపుపై దృష్టి సారించాయి. దీంతో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. మరి ఇక్కడి ప్రజలు సాంప్రదాయానికి అనుగుణంగా కొత్తవారికి పట్టం కట్టతారా? లేదా సంప్రదాయానికతీతంగా మరోసారి బండిసంజయ్‌కు పట్టం కడతారా? అనేది నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇక్కడ గెలుపు ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తోంది.

కరీంనగర్ లోక్‌సభ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఉత్తర తెలంగాణలోనే ముఖ్యమైన సీటు కావడంతో ఇక్కడ మూడు పార్టీలు బలంగా పోటీ ఇస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీఆర్​ఎస్​ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్‌రావు బరిలో నిలవగా ఈ నియోజకవర్గానికి ఇంచార్జిగా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తున్నారు. ఇతనే ముందుండి ప్రచారం నిర్వహిస్తున్నారు.

కేవలం మోదీ చరిష్మాతోనే ఎన్నికలకు : ప్రస్తుత బీజేపీ అభ్యర్థి సిట్టింగ్‌ ఎంపీ బండిసంజయ్‌ ప్రజాహిత యాత్ర పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, సంజయ్​ తెచ్చిన నిధుల గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేంద్రం నుంచి నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో వివరిస్తున్నారు. అదే విధంగా హిందుత్వ నినాదం, రామ మందిరం అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు కాంగ్రెస్, బీఆర్​ఎస్​ పార్టీల తప్పులను ఎత్తి చూపుతున్నారు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ మరోసారి గెలుపు కోసం కృషి చేయాలని కోరుతున్నారు. మోదీ నినాదంతో మరోసారి విజయం సాధిస్తాననే ధీమాతో బండి సంజయ్ ఉన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పనులే గెలిపిస్తాయి : ఇక 2014 నుంచి 2019 వరకు చేసిన అభివృద్ధి పనులను బీఆర్​ఎస్​ అభ్యర్థి వినోద్​ కుమార్​ నియోజకవర్గ ప్రజలకు వివరిస్తున్నారు. తన వల్లే కరీంనగర్​కు స్మార్ట్​ సిటీ, రైల్వే పనులు, నేషనల్​ హైవే వచ్చాయని చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేశానని ఆయన చెబుతున్నారు. బీజేపీ ఎంపీ సంజయ్ చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. అబద్ధపు హామీల పునాదుల మీద కాంగ్రెస్​ సర్కార్​ కుర్చీ వేసుకుని కూర్చుందని దుయ్యబట్టారు. తాను చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్​ విసురుతున్నారు. ఈసారి కచ్చితంగా విజయం సాధిస్తానని వినోద్​ కుమార్​ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అన్నీ తానై చూసుకుంటున్న మంత్రి పొన్నం : కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావును ఖరారు చేయడంలో బీసీ సంక్షేమశాఖమంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక పాత్ర పోషించారు. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పొన్నం సూచించిన వెలిచాల రాజేందర్‌రావుకు అభ్యర్థిత్వం ఖరారైంది. దీంతో పార్టీలో అసంతృప్తి చోటు చేసుకొందని విస్తృతంగా ప్రచారం జరిగింది. అందరిని సమన్వయ పరిచే బాధ్యతతో పాటు నియోజకవర్గ గెలుపు బాధ్యతలను పొన్నం ప్రభాకర్‌కు అధిష్ఠానం అప్పగించింది. ఇప్పటికే నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ పొన్నం ఆరు గ్యారంటీల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. బీజేపీ, బీఆర్​ఎస్​లు ఒక్కటేనని ఆరోపిస్తూ ఈ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిస్తున్నారు.

ప్రధాన రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో ప్రజల్ని ఆకర్షించేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్​ఎస్​ పోటీ పడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. బహిరంగ సవాళ్లతో రాజకీయ దుమారం రేపుతున్నారు. రాజకీయ పార్టీల వ్యూహం ఎలా ఉన్నా? చైతన్యం గల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు ఈసారి విలక్షణమైన తీర్పు ఇచ్చే పనిలో నిమగ్నమైనట్లుగా కనిపిస్తోంది.‌

మోదీ అరెస్టు చేయించాలని కుట్ర పన్నారంటూ కేసీఆర్ కొత్త డ్రామా : బండి సంజయ్ - BANDI SANJAY SLAMS KCR COMMENTS

అసెంబ్లీ ఎన్నికలు చివర్లో వచ్చినా, మధ్యలో వచ్చినా బీఆర్​ఎస్​దే గెలుపు : కేసీఆర్ - BRS Public Meeting at Huzurabad

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.