ETV Bharat / politics

ఆ 10 మంది ఎమ్మెల్యేలు లేకుంటే ప్రభుత్వం నడవదా? - కాంగ్రెస్ అగ్రనేతలకు జీవన్​రెడ్డి లేఖ​ - JEEVANREDDY WROTE LETTER TO KHARGE

కాంగ్రెస్‌ అగ్ర నేతలకు లేఖ రాసిన జీవన్‌రెడ్డి - ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకకు లేఖ - శాంతి భద్రతలపై అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్ ​రెడ్డి - పార్టీ ఫిరాయింపులపై తీవ్ర అసహనం

CONGRESS PARTY IN JAGTIAL
MLC JEEVAN REDDY (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 24, 2024, 3:13 PM IST

MLC Jeevan Reddy Letter to High Command : రాష్ట్ర కాంగ్రెస్‌లోని పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నాననే అసంతృప్తితో కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి హై కమాండ్​కు​ లేఖ రాశారు. తీవ్ర మానసిక బాధతో లేఖ రాస్తున్నందుకు విచారిస్తున్నానని తెలిపారు. కొన్ని స్వార్థపూరిత శక్తులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి నెపంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని జీవన్​ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫిరాయింపుల‌కు ముఠా నాయ‌కుడిగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫారంతో గెలిచిన వాళ్ల మాదిరి బ్లాక్ మెయిల్ చేస్తున్నార‌ని ధ్వజ‌మెత్తారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు లేకుంటే ప్రభుత్వం నడవదా? అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుదారులు కాంగ్రెస్ ముసుగు వేసుకోవడం త‌న‌కు బాధ కలిగిస్తోందని ఆందోళ‌న వ్యక్తం చేశారు. ఆధిపత్య పోరు కోసం తన అనుచరుడు గంగారెడ్డిని క్రూరంగా హత్య చేశార‌న్న జీవ‌న్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సంజ‌య్ పాత్ర ఉంద‌ని తాను ఎక్కడా మాట్లాడ‌లేద‌ని స్పష్టం చేశారు.

హ‌త్యకు పాల్పడిన బ‌త్తిన సంతోశ్ బ‌ల‌మైన బీఆర్ఎస్ కార్యక‌ర్తగా మాత్రమే చెప్పాన‌ని వివ‌రించారు. నిందితుడు సంతోశ్​పై అనేక కేసులు ఉన్నాయ‌ని ఆరోపించిన జీవ‌న్ రెడ్డి, ఎవ‌రి అండదండ‌లు చూసుకుని గంగారెడ్డిని హ‌త్య చేశార‌ని ప్రశ్నించారు. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్‌ల‌ను కలిసి త‌న ఆవేద‌న‌ చెబుతాన‌ని తెలిపారు. పార్టీ విధానానికి అనుగుణంగానే త‌న‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సుస్థిరంగా ఉందని అన్నారు. సుస్థిర ప్రభుత్వం ఉన్నా, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని తప్పుబట్టారు. పార్టీ ఫిరాయింపుల వల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పార్టీ ఫిరాయింపులను తాను జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు. హైదరాబాద్​లోని గాంధీభవన్​లో జీవన్​ రెడ్డి మాట్లాడారు.

ఎమ్మెల్యేతోనే సమస్య? : జగిత్యాల నియోజకవర్గం నుంచి జీవన్​ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడే బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన సంజయ్​ కుమార్​ కాంగ్రెస్​ పార్టీలో చేరినప్పటి నుంచి జీవన్​ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే జీవన్​ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్యకు గురయ్యాడు. దీనిపై జీవన్​ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై అసహనం వ్యక్తం చేశారు.

నేను పార్టీలో ఉండలేను : పీసీసీ చీఫ్​తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

'నాకు 35 ఏళ్ల రాజకీయ అనుభవం'- వయనాడ్​లో ప్రియాంక నామినేషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.