Janasena Chief Pawan Kalyan Speech In Praja Galam Meeting At Boppudi : రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. టీడపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ (Prime Minister Modi) ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. ‘అభివృద్ధిలేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ప్రధాని నరేంద్ర మోదీ రాక బలాన్నిచ్చిందని అన్నారు. ఎన్డీయే (NDA) పునర్ కలయిక ఐదు కోట్ల మందికి ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. మూడోసారి ప్రధానమంత్రి అయి హ్యాట్రిక్ కొట్టబోతున్న మోదీకి ఏపీ ప్రజల తరఫున ఘన స్వాగతం తెలుపుతున్నారని పెర్కోన్నారు. 2014లో తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రారంభమైన పొత్తు, ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకోబోతోందని ఆనందం వ్యక్తం చేశారు. అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారని, అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోందని పవన్ అన్నారు.
అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి: ప్రధాని మోదీ
ధర్మానిదే విజయం-పొత్తుదే గెలుపు- కూటమిదే పీఠం : సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక సారా వ్యాపారిగా మారారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంతా డిజిటల్ ట్రాన్సక్షన్ చేస్తుంటే ఏపీలోని మద్యం షాపుల్లో మాత్రమే నగదు చలామణి చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, పారిశ్రామిక ప్రగతి 2019లో 10.24 శాతం ఉండగా, ఈరోజు -3 శాతానికి దిగజారిపోయిందని తెలిపారు. అయోధ్యలో రామాలయం కట్టిన మోదీకి, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన చిటికనవేలంత రావణాసుడిని తీసేయటం కష్టం కాదని అన్నారు. డబ్బు అండ చూసుకుని ఏదైనా చేయగలనని జగన్ రెడ్డి విర్రవీగుతున్నారని పెర్కోన్నారు. గుజరాత్‌లోని ద్వారక నుంచి వచ్చిన మోదీ, ఎన్నికల కురుక్షేత్రంలో పాంచజన్యం పూరిస్తారని తెలిపారు. రామరాజ్యం స్థాపన జరుగబోతోందని, ధర్మానిదే విజయం-పొత్తుదే గెలుపు- కూటమిదే పీఠం అని ఆయన స్పష్టం చేశారు.
శాండ్, ల్యాండ్, వైన్, మైన్, అన్ని రంగాల్లో సీఎం జగన్ దోపిడీ: చంద్రబాబు
‘‘అభివృద్ధిలేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నరేంద్రమోదీ రాక బలాన్నిచ్చింది. ఎన్డీయే పునర్ కలయిక ఐదు కోట్ల మందికి ఆనందాన్ని ఇచ్చింది. మూడోసారి ప్రధానమంత్రి అయి హ్యాట్రిక్ కొట్టబోతున్న మోదీకి ఏపీ ప్రజల తరఫున ఘన స్వాగతం. 2014లో తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రారంభమైన పొత్తు.. ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకోబోతోంది. అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే ఆయన వచ్చారు. అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోంది’’ -పవన్ కల్యాణ్, జనసేన అధినేత
ఒకే వేదికపై నుంచి శంఖారావం : చరిత్రలో నిలిచేలా చరిత్రను తిరగరాసేలా తెలుగుదేశ-జనసేన-బీజేపీ కూటమి తొలి బహిరంగ సభ ముస్తాబైంది. రాష్ట్ర రాజకీయ చరిత్ర గతినే మార్చేసే కీలక ఘట్టం బొప్పూడి వద్ద ఆవిష్కృతం అయ్యింది. వైసీపీ ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు మూడు పార్టీలు చిలకలూరిపేట వేదికగా యుద్ధభేరి మోగించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పదేళ్ల తర్వాత ఒకే వేదికపైకి రానున్నారు. సార్వత్రిక సమరానికి ఆ త్రిమూర్తులు ఒకే వేదికపై నుంచి శంఖారావం పూరించారు.
మీ ప్రాణాలు ఎంతో విలువైనవి - స్తంభాల నుంచి దిగాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి