ETV Bharat / politics

పిఠాపురంలో వర్మ త్యాగం గొప్పది - ఆయన్ను ఉన్నత స్థానంలో ఉండేలా చూస్తా: పవన్ కల్యాణ్ - Pawan Pithapuram Tour Complete - PAWAN PITHAPURAM TOUR COMPLETE

Janasena Chief Pawan kalyan Pithapuram Tour Completed: పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ రెండోరోజు పర్యటన ముగిసింది. గొల్లప్రోలు నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్ ఆయన వెళ్లనున్నారు. ఎన్డీఏ నేతలతో సమావేశమైన ఆయన, వర్మ త్యాగం గొప్పది ఆయన్ను ఉన్నత స్థానంలో ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ కుట్రలు, కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాలని తెలిపారు.

Janasena Chief Pawan kalyan Pithapuram Tour Completed

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 31, 2024, 7:54 PM IST

Janasena Chief Pawan kalyan Pithapuram Tour Completed : జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కాకినాడ జిల్లా పిఠాపురంలో రెండోరోజు పర్యటించారు. ఉదయం పలు ఆలయాలని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పండితులు పవన్​కు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటాలని అందించారు. అనంతరం పవన్ పిఠాపురం లో జేజీఆర్ ఆసుపత్రిని ప్రారంభించారు.

వర్మ త్యాగం గొప్పది : పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ రెండో రోజు పర్యటన ముగిసింది. గొల్లప్రోలు నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్ ఆయన వెళ్లనున్నారు. ఈ సందర్భంగా హోటల్‌ గోకులంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు. ఎన్డీఏ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ పీఠాపురం ఇంచార్జ్ వర్మ త్యాగం గొప్పది ఆయన్ను ఉన్నత స్థానంలో ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ కుట్రలు, కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాలని తెలిపారు.

యువతకు రూ.5 వేల జీతం కావాలా? - 25 ఏళ్ల భవిష్యత్తు కావాలా?: పవన్ కల్యాణ్ - Pawan Kalyan in PithaPuram

ముగిసిన పవన్ పర్యటన : పోలింగ్ ముగిసే వరకు క్షేత్రస్థాయిలో కలిసి పని చేయాలని పవన్ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. చరిత్రలో నిలిచిపోయేలా పిఠాపురంలో మనం గెలవాలని అన్నారు. కూటమి గెలుపే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. గ్రామంలో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించాలని నేతలకు సూచించారు. కొన్ని లక్షలతో పూర్తయ్యే పనులు సొంతంగా చేద్దామని పవన్‌ తెలిపారు. హోటల్‌కి వచ్చని పవన్‌ చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.హోటల్‌ గేట్లు నెట్టుకుంటూ పవన్‌ కాన్వాయ్‌ వద్దకు వచ్చారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ రెండోరోజు పర్యటన ముగిసింది. గొల్లప్రోలు నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్ ఆయన వెళ్లనున్నారు.

రెండు విడతలుగా జనసేనాని ఎన్నికల ప్రచారం - రేపటి నుంచే ప్రారంభం - Pawan Kalyan Election Campaign

Pawan Kalyan Election Campaign Schedule : పవన్‌ కల్యాణ్ పోటీ చేసే పిఠాపురంలో రెండు విడతలుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. మొదటి విడతగా నేటి పర్యటన ముగిసింది. మళ్లీ ఏప్రిల్ 9న పిఠాపురంలో నిర్వహించే ప్రచారంలో పాల్గొంటారని అన్నారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8 కాకినాడ గ్రామీణం, 10న రాజోలు, 11 పి గన్నవరం, 12 రాజానగరంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. ఇది మొదట విడత జరిగే ప్రచార కార్యక్రమని తెలిపారు. ఇది పూర్తైన వెంటనే రెండో విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్​ను విడుదల చేస్తామని పేర్కొన్నారు.

ఈసారి పీఠం కూటమిదే - పిఠాపురంలో స్పష్టం చేసిన పవన్​ - Pawan kalyan Pithapuram Tour

పిఠాపురంలో వర్మ త్యాగం గొప్పది -పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.