ETV Bharat / politics

జగన్​కు శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతే: పవన్ కల్యాణ్ - Pawan kalyan Election Campaign - PAWAN KALYAN ELECTION CAMPAIGN

Pawan Kalyan Election Campaign: దోపిడీ దౌర్జన్యాలు ఇలాగే కొనసాగిస్తే శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతే జగన్‌కూ పడుతుందని, అధికార గర్వం ఉన్న వారిని ప్రజలు వెంటపడి తరుముతారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన వారాహి యాత్రలో పవన్‌ ప్రసంగించారు. రైతుల పాస్‌పుస్తకాలు, సరిహద్దు రాళ్లపై కూడా జగన్‌ బొమ్మలు వేస్తున్నారని మండిపడ్డారు.

Pawan Kalyan Election Campaign
Pawan Kalyan Election Campaign
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 14, 2024, 10:38 PM IST

Pawan Kalyan Election Campaign : దోపిడీ దౌర్జన్యాలు ఇలాగే కొనసాగిస్తే శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతే సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి పడుతుందని, అధికార గర్వం ఉన్న వారిని ప్రజలు వెంటపడి తరుముతారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. తాడేపల్లి ప్యాలెస్‌లోకి కూడా జనం చొచ్చుకెళ్లే రోజు దగ్గర్లోనే ఉందని తెలిపారు. జగన్‌కు రాయి తగిలితే రాష్ట్రానికే (Stone Attack on Jagan ) గాయమైనట్లు హడావుడి చేస్తున్నారని, ఆయనకు అధికార గర్వం తలకెక్కిందని, అందరినీ తన బానిసలుగా భావిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన వారాహి యాత్రలో పవన్‌ ప్రసంగించారు. రైతుల పాస్‌పుస్తకాలు, సరిహద్దు రాళ్లపై కూడా జగన్‌ బొమ్మలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కల్యాణ్​పై రాయి విసిరిన గుర్తుతెలియని వ్యక్తి- తెనాలి వారాహి యాత్రలో ఘటన - attack on pawan kalyan varahi yatra

నేను మీ కూలీని : ఒక ఆశయం కోసం వచ్చిన తనకు ఓటమి బాధ ఎలా ఉంటుందో ప్రజలకు తెలుసని పవన్ అన్నారు. రెండు చోట్లా ఓడిపోయినా తట్టుకుని ముందుకెళ్తున్నానని, ప్రజలు మోసం చేశారని తానేమి వెనక్కి తగ్గలేదని తెలిపారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం మళ్లీ జనం మధ్యకు వచ్చానని, వకీల్‌ సాబ్‌ చెప్పినట్టు తాను ప్రజల కూలీని అని, అధికారం ఇస్తే సంతోషంగా పని చేస్తానని, ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయాలు చేయట్లేదని తెలిపారు.

కూటమి ప్రభుత్వం రాగానే ఉద్యోగులకు 5వ తేదీలోపు జీతాలు ఇస్తామని హామీ ఇచ్చారు. వ్యాపార వర్గాలకు అండగా ఉంటామని, ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించే విధంగా పథకాలకు రూపకల్పన చేస్తామని అన్నారు. కేవలం కులగణనే కాదు, ప్రతిభను గణించి మహిళలను ప్రోత్సహిస్తామని, ప్రతి మహిళ ఏదో ఒక నైపుణ్యం పెంచుకోవాలని, ప్రతి గ్రామంలో మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తాం ప్రకటించారు. కౌలు రైతులకు చేస్తున్న సాయం చిరంజీవిని కదిలించింది.

కోనసీమను వైసీపీ కలహాల సీమగా మార్చే యత్నం చేసింది- పవన్‌ కల్యాణ్‌ - Pawan Kalyan at Prajagalam

చిరంజీవి రూ.5కోట్లు విరాళం ఇచ్చారు : కౌలు రైతులకు జనసేన చేస్తున్న సాయం చూసి స్పందించిన అన్నయ్య చిరంజీవి రూ.5కోట్లు విరాళం ఇచ్చారని గుర్తు చేశారు. సాయం చేయాలని రామ్‌చరణ్‌కు కూడా చెప్పారని తెలిపారు. కౌలు రైతుల కోసం తాను చేసిన ప్రయత్నం ఆయన్ను కదిలించిందని, ప్రజల కోసం బలంగా నిలబడ్డానని తనను ప్రశంసించారని అన్నారు.

రౌడీరాజ్యం పోయి రామరాజ్యం రావాలి - ధర్మం నిలబడాలి: పవన్‌ కల్యాణ్‌ - Pawan Kalyan Election Campaign

దోపిడీ దౌర్జన్యాలు ఇలాగే కొనసాగిస్తే - శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతే జగన్​కూ : పవన్ కల్యాణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.