Pawan Kalyan Election Campaign : కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రతీ చేతికి పని, ప్రతీ చేనుకు నీరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పవన్ చెప్పారు. కూటమి ఇచ్చిన హామీలు అమలు చేసే బాధ్యత తాను తీసుకుంటానని భరోసానిచ్చారు. నదులు అనుసంధానం చేసి ప్రతీ చేనుకు నీరందిస్తామనన్నారు. రైతు కన్నీరు పెట్టని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేస్తామని పవన్ హామీ ఇచ్చారు.
పెద్దాపురంలో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ పాల్గొన్నారు. పెద్దాపురం నియోజకవర్గాన్ని వైఎస్సార్సీపీ నాయకులు దోచేశారని పవన్ ధ్వజమెత్తారు. మట్టి, గ్రావెల్, ఇసుక తవ్వకాలతో ప్రకృతి వనరులను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అరాచకాలను ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమి పవన్ హెచ్చరించారు. రాష్ట్రభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని పవన్ చెప్పారు.
పచ్చని కోనసీమలో వైసీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు రాజేసింది: పవన్ - Pawan Kalyan Public Meeting
రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా గంజాయి దొరుకుతోందని, కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి విక్రయించే వాళ్లను ఉక్కుపాదంతో అణచివేస్తాంమని తెలిపారు. ద్వారంపూడి, కన్నబాబుకు నరకం అంటే ఏంటో చూపిస్తాం. వారి అంతు తేల్చేందుకే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా. జగన్ సీఎంలా కాకుండా సారా వ్యాపారిలా మాట్లాడుతున్నారు.
కాపు ఉద్యమాన్ని లేవనెత్తిన నేతలు యువతను రెచ్చికొట్టి రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని పవన్ అన్నారు. మద్యంతో జగన్ కోట్ల రూపాయల్ని వెనకేసుకున్నారని పవన్ ధ్వజమెత్తారు
కాకినాడ రూరల్ : కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నబాబు అవినీతి పరాకాష్ఠకు చేరిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు లే అవుట్ వేస్తే కన్నబాబుకు ముడుపులు ముట్టజెప్పాల్సిందని, వీళ్ల వేధింపులు తట్టుకోలేక ఓ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. యువత రౌడీయిజానికి భయపడితే ఎక్కడికి పారిపోతారని, వారిలో ధైర్యం కల్పించేందుకే ఇక్కడికి వచ్చానని అన్నారు. జగన్‌ను గద్దె దించే వరకు యువత పోరాడాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లలో రూ.70కోట్లు ట్యాక్స్ కట్టానంటే ఎంత సంపాదించగలనో అర్థం చేసుకోండని, ఇంత డబ్బు సంపాదించి కూడా తాను ఎందుకు రోడ్లపై తిరుగుతున్నానంటే ఈ నేలకోసం కష్టపడే కొంత మంది వ్యక్తుల సమూహం కావాలని అన్నారు.
30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే ముఖ్యమంత్రి ఈరోజు వరకు ఒక ప్రకటన చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దారుణాలు చూసినప్పుడు బాధేస్తోందని అన్నారు. కాకినాడ తీర ప్రాంతంలో ప్రతిసారి పడవలు దగ్ధమవుతున్నాయని, కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి బోటులో గంజాయి ఉందని గుర్తిస్తే చాలు, స్మగ్లర్లు దాన్ని తగలబెట్టేసి వెళ్లిపోతున్నారని తెలిపారు. 16, 17 ఏళ్ల యువత కూడా గంజాయికి బానిసలవుతున్నారని, వైఎస్సార్సీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తేనే సమాజం బాగుపడుతుందని అన్నారు.
రాజానగరం గంజాయి, ఇసుక దోపిడీకి కేంద్రంగా మారింది: పవన్ కల్యాణ్ - Pawan Kalyan Varahi Yatra