ETV Bharat / politics

'ఈ ఎన్నికల్లో యుద్ధం మాత్రమే ఉంటుంది - కూటమి గెలుపే లక్ష్యం' - pawan kalyan fires on ysrcp

Janasena Chief Pawan Kalyan: ఏపీలోని భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పవన్ కల్యాణ్ అధ్వర్యంలో జనసేనలో చేరారు. రామాంజనేయులు చేరిక సందర్భంగా మాట్లాడిన పవన్, స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై నిప్పులు చెరిగారు. కుబేర నగరం లాంటి భీమవరం ప్రస్తుతం ఓ రౌడీ ఎమ్మెల్యే చేతిలో ఇరుక్కుపోయిందని విమర్శించారు. త్వరలోనే భీమవరానికి విముక్తి కల్పిస్తానని పవన్ కల్యాణ్ హామి ఇచ్చారు.

Janasena Chief Pawan Kalyan
Janasena Chief Pawan Kalyan
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 12, 2024, 7:57 PM IST

'ఈ ఎన్నికల్లో యుద్ధం మాత్రమే ఉంటుంది- కూటమి గెలుపే లక్ష్యం'

Janasena Chief Pawan Kalyan Fire on YSRCP : వైఎస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ వ్యూహం మే 15తో పూర్తవుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం-జనసేన-భారతీయ జనతాపార్టీ కూటమిపై పవన్ కల్యాణ్ తొలిసారి స్పందించారు. కూటమి ఏర్పడటంలో కీలకంగా వ్యవహరించడం సంతోషంగా ఉందని చెప్పారు.

ఈ ఎన్నికలలో యుద్ధం మాత్రమే ఉంటుంది: కూటమి నుంచి పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలుపు కోసం అందరం కలసి కృషి చేస్తామని జనసేన(Janasena party) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) వెల్లడించారు. వాళ్లు వ్యూహం సినిమా తీస్తే మనం వ్యూహం వేద్దామని చెప్పారు. భీమవరం మాజీ శాసనసభ్యులు రామాంజనేయులు, ఆయన అనుచరులు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ వైఎస్సార్సీపీపై నిప్పులు చెరిగారు. గతంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి అక్కడి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్(Grandhi Srinivas) అడ్డుపడ్డారని పవన్ చెప్పారు. ఈసారి ఎన్నికలలో(Elections) బంధుత్వం ఉండదని, యుద్ధం మాత్రమే ఉంటుందని హెచ్చరించారు. త్వరలోనే భీమవరంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు.

బాబు, మోదీ మధ్యలో పవన్​!- ఆ విషయంలో జనసేనాని వ్యూహాత్మక అడుగులు

ఓడినా జనం గుండెల్లో స్థానం: కుబేర నగరం లాంటి భీమవరం ప్రస్తుతం ఓ రౌడీ ఎమ్మెల్యే(MLA) చేతిలో ఇరుక్కుపోయిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే భీమవరానికి విముక్తి కల్పిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. భీమవరంలో జనసేన గెలవగానే మౌలిక సదుపాయాలపై దృష్టి పెడతానని చెప్పారు. రామాంజనేయులు చేరిక జనసేనకు చాలా కీలకమన్నారు. గతంలో తాను గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో ఓడినా జనం గుండెల్లో స్థానం మరింత బలాన్నిచ్చిందని ధీమా వ్యక్తం చేశారు. భీమవరంలో ఓడిపోయిన వ్యక్తి, అలయెన్స్‌ను ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా మారాడని పవన్ తెలిపారు.

ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ - సీట్ల సర్దుబాటుపై కుదిరిన అవగాహన

'భీమవరంలో ఉండే జలగతో సహా వీధిరౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వస్తుందో అర్థం చేసుకోవాలి. జగన్‌ తాలూకూ జలగలను తీసిపారేయాలి. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్‌ను డోర్‌ డెలివరీ చేసి, హత్యకేసులో జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తికి జేజేలు పలికారు. దాడులపై పోరాడకపోతే మనది కూడా తప్పు అవుతుంది. పార్టీ పెట్టడానికి సొంత అన్నను కాదని బయటకు వచ్చా. భీమవరం వదలను, అక్కడి నుంచి రౌడీయిజం పోవాలి. జనసేన గెలిస్తే భీమవరంలో డంపింగ్‌ యార్డ్‌ను సరిచేస్తాం. మే 15లోపు వైఎస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ అవుతుంది. సిద్ధం, సిద్ధం అని కోకిలలా కూస్తోన్న వ్యక్తికి యుద్ధమే ఇద్దాం' - పవన్ కల్యాణ్ జనసేన అధినేత

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాయలసీమను మరచిపోవాల్సిందే : పవన్‌ కల్యాణ్‌

చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ - బీజేపీతో పొత్తు విషయం చర్చ?

వైఎస్సార్సీపీ పాలనలో 300 మంది బీసీలను చంపేశారు : పవన్ కల్యాణ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.